TRS Minister Leaked Audio Tape viral in Whats app

Another trs leader warning tape viral

TRS Minister Chandulal, Minister Azmeera Chandulal, Azmeera Chandulal, Azmeera Chandulal Tape, TRS Leader Vulgar Audio Conversation, Azmeera Chandulal Controversy, Chandulal Vulgar Tape, TRS MLAs Audio Leak, TRS MLAs behaviour KCR, Bikshapathi Munjala Chandulal Warn, KCR Warn MLAs

TRS Minister Azmeera Chandulal warn local leader Bikshapathi in Phone. Chandulal Vulgar abusing Audio tape viral on Whats app.

బూతు పురాణాలు.. కేసీఆర్ సాబ్ పట్టించుకోరా?

Posted: 06/29/2017 10:51 AM IST
Another trs leader warning tape viral

టీఆర్ఎస్ నేతలు ఇమేజ్ పెంచుకోవాల్సింది పోయి మరింత దిగజారిపోతున్నారు. వ్యవహారాలు ఒక్కోక్కటిగా బయటకు వస్తుండటం తీవ్ర విమర్శలు దారితీస్తోంది. అవినీతి సంబంధిత ఆరోపణలు పక్కన పెడితే తమ అధికార దాహాన్ని ఇతరుల మీద ప్రదర్శించటం, రెచ్చిపోయి తీవ్ర వ్యాఖ్యలు చేయటం, అవి మీడియాకు చేరుతుండటం, పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్నాయి. అయినప్పటికీ ఈ వ్యవహారంలో గులాబీ బాస్ కిక్కురుమనకుండా ఉండటం ఆశ్చర్యాన్ని కలగజేస్తోంది.  ఆ మధ్య తన ఇంటి కరెంట్ కట్ చేశాడని పరిగి ఎమ్మెల్యే రామోహన్ రెడ్డి బూతు పురాణం వల్లించటం, ఆ ఆడియో క్లిప్ బయటకు వచ్చి సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

ఇక తాజాగా టీఆర్ఎస్ నేత, మంత్రి చందూలాల్ ఆడియో ఒకటి వాట్పాప్ లో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఆ ఆడియోలో ఏముంది.. అన్న విషయాలు తెలుసుకోవాలంటే ఇది చదవండి. మంత్రి చందూలాల్, ములుగు - సమ్మక్క, సారలమ్మ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ముంజాల భిక్షపతి మధ్య జరిగిన సంభాషణ అది. అందులో చందూలాల్ తీవ్ర స్వరంతో బిక్షపతిపై విరుచుకుపడ్డాడు. నమస్తే సార్ అంటూ ఎటకారంగా మాటలు ప్రారంభించిన చందూలాల్ ప్రత్యేక జిల్లా కావాలంటావా? అని నోటికొచ్చినట్టు తిట్టాడు. చిల్లరగాడివి, నీ బతుకేంది, నువ్వేంది? పేగులు తీస్తా... అంటూ రెచ్చిపోయాడు. తన అనుచరులకు ఒక్క మాట చెప్పానంటే వచ్చి నీ కాళ్లు నరికేస్తారని హెచ్చరించాడు. తాను తలచుకుంటే ఆదుకునేందుకు ఎవరూ రారని, ములుగులో ఉడలేవంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఈ నెల 26న ఈ సంభాషణ జరిగినట్లుగా చెబుతుండగా, ఆ ఆడియో వాట్సాప్ లలో వైరల్ అవుతోంది.

దీనిపై చందూలాల్ ను సంప్రదించగా, భిక్షపతి పెద్ద మిలిటెంట్ అని, ఓ అవారాగాడు అని, రాత్రి పూట ఫోన్ చేసి వాదనకు దిగితే, తానే బాగా తిట్టానని తెలిపాడు. తన భార్యకు ఉద్యోగం కావాలని బిక్షపతి పలుమార్లు తన వద్దకు వచ్చాడని, అలా కుదరదని చెబితేనే ఇలా ఫోన్లు చేసి నకరాలు చేస్తున్నాడని ఆరోపించాడు. అంతేకాదు ఈ విషయమై అతనిపై పోలీసు కేసు పెట్టనున్నట్టు మంత్రి స్పష్టం చేశారు.

అయితే మేడారం జాతర వస్తున్నందున ములుగు కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని మంత్రికి ఫోన్ చేశానని, అందుకే తనపై బెదిరింపులకు దిగాడని బిక్షపతి చెబుతున్నాడు. చందూలాల్ నుంచి తనకు ప్రాణహాని ఉందని మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేస్తానని భిక్షపతి వెల్లడించాడు. పార్టీ పరువుపోతున్నా వార్నింగ్ ఇవ్వకపోవటం వల్లే వాళ్లు ఇలా తయారవుతున్నారని, ఇప్పటికైనా అధినేత కేసీఆర్ కలగజేసుకోవాలని నేతలు కోరుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  TRS MLA  Minister Chandulal  Audio Tape  Bikshapathi Munjala  

Other Articles