high court squashes ngt notices on palamuru lift irrigation హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట..

High court squashes ngt notices on palamuru lift irrigation

high court, Telangana government, palamuru-rangareddy lift irrigation project, national green tribunal, ngt notices, apngo, telangana

high court of andhra pradesh gives nod to construct palamuru rangareddy lift irrigation project squashing national green tribunal member notices issued by its judiciary member.

హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట..

Posted: 06/28/2017 02:39 PM IST
High court squashes ngt notices on palamuru lift irrigation

తెలంగాణ ప్రబుత్వానికి రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో ఊరట లభించింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ జారీ చేసిన నోటీసులను న్యాయస్థానం కొట్టివేసింది. ప్రాజెక్టును, పనులను పరిశీలించాలని కమిటీని ఏర్పాటు చేసింది. అప్పటి వరకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని జాతీయ గ్రీన్ ట్రిబ్యూనల్ జుడీష్యరీ సభ్యుడు నోటీసులు జారీ చేశారు. దీంతో ఈ నోటీసులపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును అశ్రయించింది.

తెలంగాణ ప్రభుత్వం పిటీషన్ పై ఇవాళ విచారించిన న్యాయస్థానం నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ జుడీషియల్ సభ్యుడు ఇచ్చిన నోటీసులను న్యాయస్థానం కోట్టివేసింది. ఆ నోటీసలు చెల్లవని పేర్కోంది. తెలంగాణ ప్రభుత్వం తరుపున రాష్ట్ర అడిషనల్ అడ్వకేట్ జనరల్ హైకోర్టులో వాదనలు వినిపించారు. దీంతో న్యాయస్థానంలో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. కాగా త్వరలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పున:ప్రారంభం కానున్నాయి.

ఇక మరో కేసులో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కదెరైంది. ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో భవనం అంశంలో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది ఎపీఎన్జీవో భవనాన్ని తమకు అప్పగించాలంటూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది. ఉత్తర్వులపై 8 వారాల పాటు స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌, ఆర్డీవోలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles