Indian Ordnance Factory Recruitment 2017 అర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీగా ఉద్యోగాలు

Indian ordnance factory recruitment 2017 for semi skilled group c posts

jobs in ordinance, jobs in defence, ordinance recruitment, defence recruitment, semi skilled jobs in ordinance, semi skilled jobs in defence, labour group jobs in odf, labour group jobs in defence, labour group jobs in ordinance, jobs, openings, recruitment, defence, ordinance, semi skilled, labour group

OFRC: Recruitment of SemiSkilled Industrial Employees (IEs) Group 'C' in different trades and Labour Group 'C' in Ordnance Factories across India.

అర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీగా ఉద్యోగాలు

Posted: 06/28/2017 03:56 PM IST
Indian ordnance factory recruitment 2017 for semi skilled group c posts

కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డులో అర్హులైన నిరుద్యోగ యువత నుంచి అన్ లైన్ ధరఖాస్తులను కోరుతుంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో వున్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్టో 3,581 ఇండస్ట్రియల్ ఎంప్లాయిస్ (సెమీ స్కిల్డ్ వర్క్ మెన్), లేబర్ గ్రూప్ ‘సి’ పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ మేరకు ఓ ప్రకటనను అర్డినెన్స్ ఫ్యాక్టరీ రిక్రూట్ మెంట్ కేంద్రం విడుదల చేసింది. కాగా పలు ట్రేడ్ లలో ఐటీఐ, అప్రెంటీస్ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా అన్ లైన్ ద్వారానే దరఖాస్తులను పంపాలని బోర్డు సూచించింది.

ఎట్టి పరిస్థితిలోనూ మాన్యువల్ అప్లికేషన్లు, హార్డ్ అప్లికేషన్ కాఫీలు స్వీకరించబడవని తెలిపింది. భారత పౌరులు ఎవరైనా దేశ జాతీయ డిపెన్సు ఉత్పాదకతకు దోహదపడాలని అసక్తి వున్నవారందరూ అన్ లైన్ ద్వారానే అప్లై చేయాలని సూచించింది. వయస్సు 18-32 ఏళ్ళలోపు ఉండి, పదో తరగతి/తత్సమాన విద్యార్హత ఉన్నవారు అర్హలు. దీంతోపాటు సెమీ స్కిల్డ్ పోస్టులకు నేషనల్ ట్రెన్డ్ సర్టఫికెట్ (ఎన్ టీసీ)/నేషనల్ అప్రెంటీస్ సర్టఫికెట్ (ఎన్ ఏసీ) కూడా ఉండాలి. రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్(ప్రాక్టికల్) ద్వారా ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు జూలై 10లోగా ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి.

బీహార్ నలందాలో మొత్తం     62 పోస్టలు
చండీగడ్ అర్డీనెన్సులో మొత్తం     50 పోస్టులు
మహారాష్ట్రలోని ఖాడ్కీ        311 పోస్టులు
మహారాష్ట్రలోని హెచ్ఇఎఫ్ లో    84 ఖాళీలు
మహారాష్ట్రలోని బంధరాలో     90 పోస్టులు
మహారాష్ట్రలోని అంబజ్హరిలో     219 ఖాళీలు
మహారాష్ట్రలోని భుసవాల్లో    181 పోస్టులు
మహారాష్ట్రలోని చంద్రపూర్ లో     91 పోస్టులు
మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో    176 ఖాళీలు
మధ్యప్రదేశ్ లోని ఇటార్సీలో    50 పోస్టులు
మధ్యప్రదేశ్ లోని ఖమర్యా లో     129 ఖాళీలు
మధ్యప్రదేశ్ లోని ఖత్నీలో    24 ఖాళీలు
ఒడిశాలోని బొలంగిర్ లో     465 ఖాళీలు
తమిళనాడులో అవడి హెచ్వీఎఫ్ లో    306 పోస్టులు
తెలంగాణలోని మొదక్ లో     133 పోస్టులు
ఉత్తరాఖండ్ లోని డెహ్రడూన్లో    138 ఖాళీలు
ఉత్తరాఖండ్ లోని రాయ్ పూర్లో    160 పోస్టులు
ఉత్తర్ ప్రదేశ్లోని కాన్పూర్ లో    594 పోస్టులు
ఉత్తర్ ప్రదేశ్లోని మురాద్నగర్లో    193 ఖాళీలు
పశ్చిమబెంగాల్ లోని కొలకత్తాలో    125 ఖాళీలు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jobs  openings  recruitment  defence  ordinance  semi skilled  labour group  

Other Articles