Meira Kumar files nomination for Presidential poll ప్రముఖుల సమక్షంలో మీరాకుమార్ నామినేషన్

Opposition s presidential candidate meira kumar files nomination

Meira Kumar files nomination, Meira Kumar presidential polls, Meira Kumar, Presidential elections 2017, Sonia Gandhi, Opposition candidate for president, Congress, Manmohan Singh, Sharad Pawar, NCP, Sitaram Yechury

Opposition presidential candidate Meira Kumar on Wednesday filed her nomination in the presence of top Congress and opposition leaders.

ప్రముఖుల సమక్షంలో మీరాకుమార్ నామినేషన్

Posted: 06/28/2017 01:40 PM IST
Opposition s presidential candidate meira kumar files nomination

దేశ అత్యున్నత అధ్యక్ష పదవికి జరుగుతున్న రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ సహా 17 విపక్షాల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి మీరాకుమార్‌ ఇశాళ నామినేషన్‌ దాఖలు చేశారు. పార్లమెంటు భవన్ లో అమె కాంగ్రెస్ అగ్రనేతలు, విపక్షాల అగ్రనేతలు, కాంగ్రెస్, వామపక్ష పాలిత ముఖ్యమంత్రులు, మాజీ కేంద్రమంత్రుల తదితర ప్రముఖుల సమక్షంలో అమె తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ అధినేత్రి  సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, మల్లిఖార్జున్ ఖార్గే, గులాం నబీఆజాద్‌, సీతారాం ఏచూరి, శరద్ పవార్ తదితరులు హాజరయ్యారు.

మీరాకుమార్ నామినేషన్ లో భాగంగా మూడు సెట్లను సమర్పించారు. మీరా కుమార్ కు మద్దతుగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, శరద్ పవార్, సీతారాం ఏచూరి అమె నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. కాగా అంతకుముందు ఆమె రాజ్‌ఘాట్‌ వద్ద పూజ్య బాపూజీకి నివాళులర్పించి పార్లమెంట్‌ భవనానికి చేరుకున్నారు. అయితే క్రితం రోజు అమె మీడియాతో మాట్లాడుతూ ఇద్దరు దళిత వ్యక్తుల మధ్య పోటీ అని మీడియా పేర్కోనడంపై విచారం వ్యక్తం చేశారు.

మీరాకుమార్‌ తన ప్రచారాన్ని గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమం నుంచి ప్రారంభించనున్నారు. ప్రచారంలో భాగంగా అమె జులై 3న హైదరాబాద్‌ రానున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాట్లాడుతూ రాష్ట్రపతి ఎన్నికల పోరు నిజంతో జరుగుతున్న పోరాటంగా అభివర్ణించారు. ఈ పోరులో తాము పోరాడుతామని అన్నారు. అంతకుముందు కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. వెన్నుపోట్ల ఐడియాలజీల నేపథ్యంలో వస్తున్న అధికార అభ్యర్థికి.. జాతీయ వాదంతో జాతిని, దేశ ప్రజలను ఐక్యంగా కలుపుకుపోయే అభ్యర్థులకు మధ్య జరుగుతున్న పోరాటమని అన్నారు. మీరాకుమార్ లాంటి గొప్ప నేత రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలుస్తుండటం మనం గర్వంగా భావించాల్సిన అవసరముందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Meira Kumar  Presidential poll  Sonia Gandhi  Manmohan Singh  Sharad Pawar  Sitaram Yechury  

Other Articles