Woman Gang rape in Moving car in Gurgaon

Woman thrown after gang rape in gurgaon

Gurgaon Gang Rape, Gurgaon Moving Car Rape, Gang Rape in Car Delhi, Rajasthan Woman Gang Rape, Gurgaon to Greater Noida Rape, Delhi Woman Security, Woman Raped in Car, Delhi Gang Rape, Another Nirbhaya Case, Rape Cases in Delhi 2017

Woman alleges gang rape in moving car for 8 hours. The rape of a 35-year-old woman in Greater Noida has again highlighted the laxity of security measures in MG road Gurugram(Gurgaon).

8 గంటలు కారులో నరకం...

Posted: 06/21/2017 09:35 AM IST
Woman thrown after gang rape in gurgaon

కఠిన చట్టాలతో అయినా మార్పు వస్తుందని భావించినప్పటికీ మానవ మృగాలు అంతకంతకు రెచ్చిపోతున్నాయి. భద్రత పటిష్టంగా ఉండాల్సిన దేశ రాజధానియే మహిళలపై అఘాయిత్యాలకు వేదికగా మారుతోంది. 48 గంటల్లోనే 5 రేప్ కేసులు నమోదవ్వటం శోచనీయం. గురుగావ్ లో వీధుల్లోనే నిర్భయంగా జరిగిన మరో ఘోర ఘటన కలకలం రేపుతోంది.

రాజస్థాన్‌ లోని భరత్‌ పూర్‌ కు చెందిన ఓ మహిళ (35) భర్త నుంచి విడిపోయి వంట పని చేస్తూ తన ముగ్గురు పిల్లలతో జీవిస్తోంది. గురుగావ్ లో ఉన్న తన కుటుంబ సభ్యులను చూసేందుకు 15 రోజుల క్రితం వచ్చింది. సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో భోజనం చేశాక ఇంటి పరిసరాల్లో వాకింగ్ చేస్తుంది. ఇంతలో దూసుకొచ్చిన ఓ స్విప్ట్‌ కారు, అందులోని ముగ్గురు దుండగులు ఆమెను కారులోకి లాగేశారు. వీధుల గుండా కారును తిప్పుతూ ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.

అలా 8 గంటలపాటు వారి రాక్షస క్రీడ కొనసాగింది. అనంతరం ఉదయం నాలుగు గంటల సమయంలో ఓ దాబా దగ్గర ఆమెను పడేసి పారిపోయారు. ఓ ఆటోడ్రైవర్ సాయంతో ఆస్పత్రికి చేరిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఒంటిపై గాయాలు ఉన్నాయని, రిపోర్టుల వచ్చాకే ఆమె అత్యాచారయత్నం గురించి వివరాలు వెల్లడిస్తామని వైద్యులు తెలిపారు.

అయితే ఆమె చెబుతున్న కథనం, ఆస్పత్రిలో చేరిన విధానంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తనంతట తానుగానే ఆమె కారులో ఉంటుందని భావిస్తున్నారు. సీసీ పుటేజ్ తోపాటు, ఆటోడ్రైవర్ ను విచారించి అసలు విషయం రాబట్టేందుకు యత్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi  Gurgaon  Gang rape  

Other Articles