తెలుగు వార్తా ఛానెలల్లో సమగ్ర మార్పు తీసుకొచ్చిన టీవీ 9 ఛానెల్ అమ్మకానికి సిద్ధమౌతున్నట్లు సమాచారం. తెలుగు, కన్నడ, గుజరాతీ, మరాఠీ, ఆంగ్ల భాషల్లో వార్తా చానల్స్ నిర్వహిస్తున్న అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఏబీసీఎల్) నుంచి మెజారిటీ వాటాలను విక్రయించేందుకు చర్చలు సాగుతున్నాయని తెలుస్తోంది. ప్రధానంగా నాలుగు మీడియా సంస్థలు టీవీ-9 బ్రాండ్ కోసం ఆసక్తిని చూపుతున్నాయని, మరో నెల రోజుల్లో చర్చలు పూర్తి కావచ్చని సమాచారం.
ప్రస్తుతం ఏబీసీఎల్ లోని 80 శాతం వాటాలు చింతలపాటి శ్రీనిరాజు ఆధ్వర్యంలో నడుస్తున్న పీపుల్ క్యాపిటల్ ఎల్ఎల్సీతో పాటు, యూఎస్ కు చెందిన పీఈ (ప్రైవేటు ఈక్విటీ) సంస్థ సైఫ్ పార్ట్ నర్స్ వద్ద ఉండగా, మిగతా వాటా సంస్థ సీఈఓ రవిప్రకాష్ తదితరుల వద్ద ఉంది. ఆర్థిక సేవలందిస్తున్న డెల్లాయిట్, కేపీఎంజీ, ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థలు ఏబీసీఎల్ విలువను లెక్కిస్తుండగా, జీటీవీ సహా మరో 3 మీడియా కంపెనీలు టీవీ-9 కోసం చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.
ఆర్థిక సంస్థల నివేదిక ప్రకారం, ఏబీసీఎల్ కోసం దాఖలయ్యే బిడ్ లో అత్యధిక ధరను కోట్ చేసిన కంపెనీకి అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ లో 80 శాతం వాటా దక్కనుంది. ఇక టీవీ-9 బ్రాండ్ విలువ రూ. 850 కోట్ల నుంచి రూ. 1000 కోట్ల మధ్య ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఉద్యోగుల భద్రతకు వచ్చిన నష్టమేమి లేదని, వారిని యథాతథంగా కొనసాగించే ఏర్పాట్లు చేయబోతున్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం ఎమ్మెస్ వోలు తెలంగాణ వ్యాప్తంగా బ్యాన్ వేసిన సమయంలోనే అమ్మేస్తున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. కానీ, ఇప్పుడు మాత్రం అది దాదాపు ఖాయం అయ్యిందనే సమాచారం అందుతోంది.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more