Eight Time MP Daughter sells Mangoes on Streets

Mp kariya munda daughter sold mangoes on streets

Kariya Munda, Chandravati Saru, Kariya Munda Chandravati Saru, MP Daughter Mangoes, MP Kariya Munda Daughter Sold, Eight Time MP Mangoes, Kariya Munda President Race

Meet Chandravati Saru, daughter of former deputy Lok Sabha speaker Kariya Munda. Saru, who is a teacher by profession, can be seen selling Mangoes on Kunti Streets.

ఎంపీకి తగ్గట్లే ఆయన కూతురు కూడా...

Posted: 06/17/2017 08:34 AM IST
Mp kariya munda daughter sold mangoes on streets

తమ పెద్దల నుంచి వస్తున్న ఆస్తులను హం ఫట్ చేస్తూ విలాస వంతమైన జీవితం పేరిట ఎంజాయ్ చేసే వాళ్లను చూస్తున్నాం. దానికి అధికార బలం కూడా తోడైతే ఇక వాళ్లని ఆపేవాళ్లే ఉండరు. అలాంటిది ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా 8 పర్యాయాలు ఎంపీగా ఎన్నికైన ఓ వ్యక్తి కుమార్తె ఏం పని చేస్తుందో తెలిస్తే ఎవరైనా షాక్ అయి తీరతారు.

రాంచీకి 40 కిలోమీటర్ల దూరంలోని కుంతి లో ఓ మహిళ కూరగాయాలు, పండ్లు అమ్ముతూ కనిపిస్తుంటోంది. దగ్గరగా వెళ్లి చూస్తే ఆమె ఎవరో అర్థమైపోతుంది. లోక్ సభ మాజీ డిప్యూటీ స్పీకర్, కేంద్ర మాజీ మంత్రి కరియా ముండా కుమార్తె చంద్రావతి సరు ఆమె. ఓ జాతీయ స్థాయి నేత కుమార్తె అయిన ఆమె ఎలాంటి హోదా, దర్పం ప్రదర్శించకుండా సాదా సీదా గా ఇలా కనిపించటం రెండేళ్ల క్రితం ఓ జాతీయ మీడియా ప్రముఖంగా ప్రచారం చేసినా మిగతా వాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. నిరాడంబరుడైన రాజకీయ నాయకుడిగా కరియాకు మంచి పేరుంది. ఆత్మగౌరవంతో బతకడం ఎలా అన్నదే తమ తండ్రి నేర్పించాడని చంద్రావతి చెబుతోంది.

టీచర్ గా పని చేస్తున్న ఆమెకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. అందుకే ఇలా ఖాళీ సమయాల్లో కూరగాయలు, పండ్లు అమ్ముతుంది. ఇలా అమ్మగా వచ్చిన డబ్బును అవసరంలో ఉన్నవారిని ఆదుకునేందుకు ఉపయోగిస్తానని చెబుతున్నారు. యువతరం గతాన్ని మర్చిపోతున్నారని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం, ఏ స్థాయికి వెళ్లినా గతాన్ని మర్చిపోకుండా ఉండడం ముఖ్యమని ఆమె చెబుతున్నారు.

ప్రస్తుతం లోక్ సభ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న కరియా ముండా రాష్ట్రపతి రేసులో నిలవటంతో ఈ విషయం ఇప్పుడు హైలెట్ అవుతోంది.  ఇప్పుడు కూడా ఇప్పటికీ ఒక చిన్న ఇంటిలోనే ఉంటారు. రాజకీయంగా ఎంతో ఎదిగినప్పటికీ.. సాధారణ జీవితాన్నే ఆయన ఇష్టపడతారు. పార్లమెంటు సమావేశాలు లేని సమయంలో ఆయన పొలం పనుల్లో బిజీ అవుతారు. అతని ఇంటి ఆవరణను స్వయంగా శుభ్రం చేసుకుంటారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kariya Munda  Chandravati Saru  Lok Sabha Speaker  

Other Articles