RCom introduced The Jalsa Unlimited Offer

Rcom new rs 333 postpaid plan

RCom, RCom Offers, RCom New Plan, RCom Jio Competition, RCom Rs 333, Reliance Communications Offers, Reliance Communications 333 ffer, Reliance Communications New Offer, Reliance Communications The Jalsa Unlimited

RCom offers 30 GB data and 1000 local & STD minutes for Rs 333 to postpaid. Reliance Communications has rolled out a new offer for its postpaid customers, the Jalsa Unlimited pack of Rs 333 that offers free voice calling minutes along with data benefits.

న్యూ ఆఫర్: ది జల్సా అన్ లిమిడెడ్

Posted: 06/17/2017 09:06 AM IST
Rcom new rs 333 postpaid plan

టెలికాం సంస్థల వ్యవహారశైలిలో సమూల మార్పులు సంభవించాయి. రిలయన్స్ జియో తెచ్చిన మార్పులతో ఒక్క సారిగా మిగతా సంస్థలు కూడా దిగొచ్చాయి. డేటా ఆఫర్ల పేరిట నెలకొన్న పోటీ నేపథ్యంలో ఎక్కువ టారిఫ్ ను తక్కువ ధరకు అందిస్తూ వినియోగదారులకు ఉపయోగకరంగా మారుతున్నాయి . ముఖ్యంగా మార్కెట్ లో గణనీయమైన వాటా, లాభాలను దక్కించుకునేందుకు జియో, ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్, ఐడియా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ వంటి సంస్థలు సరికొత్త ఆఫర్లతో ఆకట్టుకుంటున్నాయి.

ప్రత్యర్థి సంస్థల పోటీని తట్టుకునేందుకు రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ సరికొత్త ఆఫర్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.‘జల్సా అన్‌ లిమిటెడ్’ పేరుతో పోస్ట్‌ పెయిడ్ యూజర్ల కోసం ఈ ఆఫర్ తెచ్చినట్టు ఆర్ కాం తెలిపింది. 333 రూపాయలతో ఈ ఆఫర్ తీసుకునే పోస్టు పెయిడ్ వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాల్స్ తో పాటు 30 జీబీ 4జీ డేటా వినియోగించుకోవచ్చని తెలిపింది. అలాగే ఏ ఇతర నెట్ వర్క్ కైనా 1000 నిమిషాల ఉచిత లోకల్, మరో 1000 ఉచిత ఎస్టీడీ నిమిషాలు, 100 ఎస్సెమ్మెస్ లు ఫ్రీ అని తెలిపింది.

వెంటనే ఈ ఆఫర్ ను సబ్ స్క్రైబ్ చేసుకుంటే ఏడాదిపాటు ఈ ఆఫర్ పొందవచ్చని తెలిపింది. అంతకు ముందు జియో దెబ్బకు కుదేలు కావటంతో కస్టమర్లను అట్రాక్ట్ చేయటానికి 699, 499 మరియు 299 ఫ్లాన్ లపై 28 శాతం డిస్కౌంట్ ఇచ్చి 499, 399, 249 గా మార్చిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Reliance Communications  The Jalsa Unlimited  RC 333  

Other Articles