girl assaulted for rejecting youth love proposal అమ్మాయికి లవ్ ప్రపోజల్ మరీ ఇలానా..?

Girl assaulted for rejecting youth love proposal

CCTV, Youth assaults girl, love proposal, Caught on cctv, up police, up ki gundai, cctv, youth, girl, love proposal, pilibhit, police, crime

A youth assaulted a girl in pilibhit of uttat pradesh after she allegedly rejected his love proposal was caught in cctv footage

ITEMVIDEOS: అమ్మాయికి లవ్ ప్రపోజల్ మరీ ఇలానా..?

Posted: 06/16/2017 06:38 PM IST
Girl assaulted for rejecting youth love proposal

ప్రేమ పేరుతో ఆకతాయి యువత రెచ్చిపోతోంది. భారత్ దేశంలో మహిళలు, యువతులపై లైంగిక వేధింపులు, హింస పెరిగిపోతున్నాయని.. ప్రపంచ దేశాలు తమ టూరిస్టులకు హెచ్చరిస్తూ.. భారత్ వెళ్తే జాగ్రత్తగా వుండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నా.. మనవారికి మాత్రం ఇంకా జ్ఞనోదయం కావడం లేదు. బలవంతంగా ప్రేమించమంటూ అమ్మాయిల వెంటపడుతున్న ప్రేమోన్మాదుల నుంచి కంటిపాపను ఎలా కాపాడుకోవాలో తెలియక అమ్మాయిల తల్లిదండ్రులకు అకతాయిలు పెద్ద సమస్యగా తయారయ్యారు.

అడవారు కనబడితే చాలు వారి పట్ల లైంగిక వేధింపులు, హింస్మాత్మక ఘటనలు అనేకం జరుగుతున్న రాష్ట్రాల్లో ఉత్తర్ ప్రదేశ్ గచింరి చెప్పనక్కర్లేదు. తాజాగా ఇటువంటి ఘ‌ట‌నే మ‌రొక‌టి ఉత్తరప్రదేశ్ లోని ఫిలిబిత్ లో చోటు చేసుకుంది. కొంత కాలంగా ఓ అమ్మాయి వెంట‌ప‌డుతున్న ఓ యువ‌కుడు తాజాగా ఆమె ముందు నిల‌బ‌డి తన లవ్ ను ప్రపోజ్ చేశాడు. అందుకు ఆ యువతి నిద్వందంగా తిరస్కరించింది. త‌న‌ను ఎందుకు ప్రేమించడం లేదని అడిగాడు. ఆ యువతి త‌న‌ను వ‌దిలేయాల‌ని వేడుకుంది.

దీంతో ప్రేమిస్తావా?  లేదా? అంటూ ఆ యువ‌కుడు ఆమెపై దాడి చేశాడు. ఒక్కసారి కాదు.. ఏకంగా ఐదు సార్లు టపటపమని వరుసగా కోట్టేశాడు. దీంతో షాక్ గురైన యువతి విలసిస్తున్నా పట్టించుకోలేదు. దీంతో పక్కనే వున్న యువతి స్నేహితురాలు ఆ యువ‌కుడి బారి నుంచి విడిపించి తీసుకువెళ్తుండగా, ఆ అకతాయి యువకుడు మళ్లీ అడ్డువచ్చి అమ్మాయిని పక్కకు లాక్కువచ్చి ఏంటీ నీ ప్రాబ్లమ్.. నన్ను ఎందుకని ప్రేమించవు.. అంటూ కూల్ గా అడగటం ప్రారంభించాడు. తన ప్రేమను యువతితో ఒప్పంచేందుకు శతవిధాలా ప్రయత్నించాడు.


ఈ తతంగాన్ని మొత్తం అదే దారిలో వస్తున్న మరో మహిళ చూసింది. సరాసరి యువకుడు ఇద్దరు యువతులు వున్న చోటికి వచ్చి తన బైక్ అపింది. ఏం జరగనట్టుగా యువకుడు వారేదో తన స్నేహితులు అన్నట్లుగా ప్రవర్తించాడు. అనుమానం వచ్చిన మహిళ తన బైక్ ను పార్క్ చేసింది. అక్కడే కొంత సేపు నిల్చుని ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేసింది. చివరకు బాధితురాలిచేయి పట్టుకుని తన వెంట లోపలికి తీసుకెళ్లింది. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడం.. బాధితురాలు కుటుంబసభ్యులతో కలసి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cctv  youth  girl  love proposal  pilibhit  police  crime  

Other Articles

Today on Telugu Wishesh