si attempt rape the reason behind beautician shirisha suicide నమ్మినవాడే బ్యూటీషియన్ శీరీష..నట్టేట ముంచాడు

Si attempt rape the reason behind beautician shirisha suicide

banjara hills, film nagar, RJ photography, vallabhaneni rajeev kumar, tejaswini, software employee, prabhakar reddy, kukunoor police station, shirisha, sub inspector, sucide, beautician, beautician suspicious death, beautician in a city-based, Beautician death mystery, telangana, crime

Hyderabad police traced the suicide case of beautician sirisha and the reason behind kukunoorpally si prabhakar reddy sucide. RJ photography rajeev kumar and shirisha friend sravan Arrested in this case.

బ్యూటీషియన్ శీరీష.. ఎస్ఐలను ట్రాప్ చేసి ప్రాణం తీశాడు..

Posted: 06/16/2017 03:49 PM IST
Si attempt rape the reason behind beautician shirisha suicide

తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన విజయలక్ష్మి అలియాస్ శీరీష అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీని హైదారాబాద్ పోలీసులు చేధించారు. అమె కారణానికి శాస్త్ర, సాంకేతికంగా, వైద్యపరంగా అన్ని వివరాణలు తెలుసుకన్న పోలీసులు అమెది అత్మహత్యేనని తేల్చారు. అమె మెడ వెనుక ఎముక విరడంతోనే అసువులు బాసిందని ఫోరెన్సిక్ నివేదికలో కూడా వైద్యాధికారుల బృందం స్పష్టం చేసిందని కమీషనర్ మహిందర్ రెడ్డి తెలిపారు. ఈ కేసులో వివరాలను ఇవాళ మధ్యహ్నం రెండు గంటలకు మీడియా సమావేశంలో ఆయన వెల్లడిస్తూ.. శిరీషపై కుకునూర్ పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి అత్యాచారానికి యత్నించడంతో మనస్తాపానికి గురైన అమె అత్మహత్య చేసుకుందని తెలిపారు. శిరీషతో పాటు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యలకు మూల కారణమైన వ్యక్తి శ్రావణ్ అని చెప్పారు.

ఫిల్మ్ నగర్లోని అర్జే ఫోటోగ్రపిలో బ్యూటిషియన్ గా, మేకప్ అర్టిస్టుగా నాలుగేళ్లుగా విధులు నిర్వహిస్తున్న శిరీషకు 13ఏళ్ల క్రితం వివాహమైందని, అమెకు 12 ఏళ్ల కుతురు కూడా వుందని అమె స్వస్థలం ఆచంట అని తెలిపిన పోలీసులు.. నాలుగేళ్లగా ఉద్యోగం చేస్తున్న క్రమంలో యజమాని వల్లభనేని రాజీవ్ కుమార్ తో పన్నిహిత్యం పెరిగి వారిద్దరి మధ్య అక్రమ సంబంధానికి దారితీసిందని తెలిపారు. ఈ క్రమంలో గత ఏడాది క్రితం ఫేస్ బుక్ లో తేజస్వినీ అనే యువతి రాజీవ్ కుమార్ కు పరిచయం కావడంతో అమెతో నిత్యం టచ్ లో వుంటున్నాడని.. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారని పోలీసులు తెలిపారు. దీంతో బెంగళూరులో సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న తేజస్విని.. ఇటీవల హైదరాబాద్ కు ట్రాన్స్ ఫర్ చేయించుకుంది.

తేజస్విని ఎవరు..? శిరీషతో అమెకు గొడవెందుకు..?

అంతుకుముందే ఒక పర్యాయం హైదరాబాద్ వచ్చిన తేజస్వినికి హైదరాబాద్ మొత్తాన్ని తిప్పిచూపాడు రాజీవ్. అయితే గత మూడు నెలలుగా తేజస్వినిని రాజీవ్ కొంత దూరం పెట్టాడు. దీంతో ఇద్దరం ఒక్కటవుదాం అనుకునే క్రమంలో తనను రాజీవ్ దూరం పెట్టడంపై వివరం తెలసుకుందానమని కార్యాలయాని వచ్చిన తేజస్వినికి షాకింగ్ న్యూస్ తెలిసింది. రాజీవ్ సార్, అయన భార్య ఇప్పుడు వెళ్లారని అక్కడి కార్యాలయ సిబ్బంది చెప్పడంతో అమె షాక్ కు గురైంది. తీరా విషయంలోకి ఎంటరైన తేజస్వినికి మ్యాటర్ అర్థమై శిరీషపై అగ్రహం వ్యకం చేసింది. దీంతో ఇద్దరూ పరస్పరం పోలిస్ స్టేషన్ కు వెళ్లి పిర్యాదు కూడా చేసుకున్నారు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీనివాస్ వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. తన సమస్య పరిష్కారం కాకపోతే మరోమారు తాను పోలిస్ స్టేషన్ కు వస్తానని శిరీష్ తెలిపింది.

దీంతో ఇద్దరి మద్యలో చిక్కకున్న రాజీవ్ ఇద్దరినీ శాంతపర్చి.. పోలీసులకు లిఖితపూర్వక పిర్యాదులు ఇవ్వకుండా అడ్డుకుని.. ఇద్దరనీ ఓదార్చుతూ తన కారులో తీసుకెళ్లాడు. ఇలాగే వుండివుంటే సమస్యలు కొన్నాళ్లైనా పరిష్కరించబడివుండేదేమో. కానీ తనకు పరిచయస్తుడైన శ్రావణ్ కు శిరీష్ ఫోన్ చేయడమే.. కథలో మరో మలుపుకు కారణమైంది. అంతేకాదు ఇద్దరు ప్రాణాలు అకారణంగా పోవడానికి.. ఓ బిడ్డకు తల్లిని దూరం చేసింది. తన భార్య ఉద్యోగం చేస్తూ తనకు చేదోడు వాదోడులా నిలుస్తుందని భావనలో వున్న ఓ భర్త నమ్మకాన్ని బూడిద చేసింది.

అసలు శ్రావణ్ ఎవరు..? శీరీష, రాజీవ్, ఎస్ఐలతో సంబంధమేంటి.?

శ్రావణ్ నల్గొండ జిల్లా పరిధిలోని మాల్ కు చెందిన వ్యక్తి. దేవరకోండలో నివాసముంటున్నాడు. తాను ఎస్ఐ పరీక్షలు రాసేందుకు పరీక్షలకు కోచింగ్ తీసుకునే క్రమంలో నగరానికి వచ్చాడు. లోటస్ పాండ్ సమీపంలో వున్న అతని శిక్షణా కేంద్రానికి పక్కనున్న బ్యూటిక్ కు శీరష వెళ్తుండేది. ఈ క్రమంలో అమెను చూసిన శ్రావణ్.. అమెతో మాటలు కలసి పరిచయం చేసుకున్నాడు. తాను ఎస్ఐ పరీక్షలు రాస్తున్నానని, త్వరలోనే జాబ్ కూడా వచ్చేస్తుందని చెప్పాడు. దీంతో వీరిద్దరి మధ్య పరిచయం పెరిగింది. తేజస్విని తనపై పిర్యాదు చేసిన క్రమంలో తనకు పరిచయస్తుడైన శ్రావణ్ కు శిరీష ఫోన్ చేసి సలహా అడిగింది.

దీంతో దేవరకొండలో ఎస్ఐగా పనిచేస్తున్న క్రమంలో తాను కూడా ఎస్ ఐ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నానని చెప్పి.. ఇద్దరం ఒకే జిల్లావాసులు కావడంతో ఎస్ఐ ప్రభాకర్ రెడ్డితో పరిచయం చేసుకుని అ పరిచయాన్ని అలాగే పెంచకున్నాడు శ్రావణ్. అ పరిచయంతోనే ప్రస్తుతం కుకునూర్ పల్లిలో వున్న ప్రభాకర్ రెడ్డికి ఫోన్ చేసి శిరీష విషయంలో తనకు సాయం చేయాలని కోరాడు శ్రావణ్. దీంతో బంజారాహిల్స్ పోలిస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న తన బ్యాచ్ మేట్ హరిందర్ కు ఫోన్ చేసి వారికి సాయం చేయాల్సిందిగా కోరాడు ప్రభాకర్ రెడ్డి. అయితే అప్పటికే బాధితులు పోలిస్ స్టేషన్ కు రావడం.. పిర్యాదులు చేసుకోవడం కౌన్సిలింగ్ నిర్వహించడం అంతా పూర్తైందని, దీనిని ఎస్ఐ శ్రీనివాస్ టేకఫ్ చేశారని కూడా ప్రభాకర్ రెడ్డికి తెలిపాడు ఎస్ ఐ హరిందర్.

ఈ క్రమంలో పోలిస్ స్టేషన్ కు చేరుకున్న శ్రావణ్ అక్కడి నుంచి రాజీవ్, శిరీషలను కలుసుకుని వారి వద్దకు వెళ్లి ట్రాప్ చేయడం ప్రారంభించాడు. అందులో భాగంగా వున్నఫళ్లంగా ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి వద్దకు పర్సనల్ గా వెళ్తే ఆయన తమకు సాయం చేస్తాడని నమ్మబలికాడు. అక్కడే మనవాడు రాంగ్ రూట్ డైరట్ చేయడం.. నిజంగా సాయం దొరుకుతుందన్న క్రమంలో రాజీవ్, శిరీషలను అతడ్ని నమ్మి.. అతడి ట్రాప్ లో చిక్కుకున్నారు. అయితే వీళ్లను ట్రాప్ చేసినట్లే అటు ఎస్ఐతో కూడా పనులు చేయించుకునేందుకు శిరీషను వాడుకోవచ్చు అనుకుని ఎస్ఐ కి కూడా ఏమని చెప్పాడో.. ఎలా చెప్పాడో కానీ.. హైదరాబాద్ కేసును తాను ఎలా డీల్ చేయగలను అన్న అలోచన కూడా లేకుండా ప్రభాకర్ రెడ్డి శ్రావణ్ ట్రాప్ లో పడిపోయాడు.

రాజీవ్ శిరీషతో కలసి కుకునూర్ పల్లి వెళ్తూ వెళ్తూ.. మద్యం బాటిళ్లు.. స్నాక్ తీసుకుని అర్థరాత్రి 11.30 గంటలకు కుకునూర్ పల్లి పోలిస్ క్వార్టర్స్ కు చేరుకున్నారు. అక్కడ ఎస్ఐ ప్రభాకర్ రెడ్డికి కేటాయించిన గదిలోకి వెళ్లిన వారు సమస్య గురించి మాట్లాడుతూ.. నలుగురు మద్యం సేవించారు. ఆ తరువాత కొద్దిసేపటికి రాజీవ్.. శ్రావణ్ లు ఇద్దరూ సిగరేట్ తాగడం కోసం బయటకు వెళ్లారు. అప్పుడే ఎస్ఐ కూడా వారితో పాటు బయటకు వెళ్లి.. దగ్గర్లో ఓ వ్యభిచార నిర్వహాణా కేంద్రం ఉందని.. కావాలంటే మీరు అక్కడికి వెళ్లిరావాలని వారిని కొరాడు. అది విన్న శిరీష.. షాక్ కు గురై భర్తకు తానున్న లోకేషన్ ను గూగుల్ ద్వారా షేర్ చేసింది. అప్పటికే రాత్రి ఒంటిగంటా 58 నిమిషాలు కావడంతో భర్త నిద్రపోయిన కారణంగా దానిని చూసుకోలేదు.

శిరీష ఒంటిపై గాయాలు ఎలా అయ్యాయి.?

ఆ తరువాత రాత్రి రెండు గంటల సమయంలో రాజీవ్ కు పదే పదే మెసేజ్ లు పంపింది. రాజీవ్ డోన్ట్ లీవ్.. ప్లీజ్ బీ విత్ మి.. రాజీవ్ నను వదిలి ఎక్కడకు వెళ్లకు.. నాతోనే వుండూ అంటూ మెసేజ్ పెట్టింది. శిరీష మెసేజ్ లు చూసిన రాజీవ్ లోపలికి వెళ్లాడు. ఆ తరువాత మరికోద్ది సేపటి తరువాత మళ్లీ రాజీవ్, శ్రావణ్ లు సిగరెట్ తాగడం కోసం బయటకు వచ్చారు. దీంతో తాను బయటకు వస్తానని అంటే సెంట్రీలు చూస్తే సమస్య వస్తుందని అమెను భయపెట్టి అక్కడే గదిలోనే వుంచారు. అయితే అదే గదిలో ఎస్ ప్రభాకర్ రెడ్డి కూడా వున్నాడు. ఈ క్రమంలో శిరీషపై అతను అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.

దీంతో తాను అలాంటి దానిని కాదూ అంటూ శిరీష బిగ్గరగా అరవడం ప్రారంభించింది. దీంతో బయటనున్న రాజీవ్, శ్రావణ్ లు లోనికి వచ్చి.. ఎస్ఐ ప్రభాకర్ రెడ్డిని పక్కకు నెట్టారు. అయితే అప్పటికీ అమె గోడకు ఓ మూలన నక్కి.. తాను అలాంటి దాన్ని కాదు.. తనను వదిలిపెట్టండీ అని పెద్దగా కేకలు వేసింది. దీంతో పక్కన క్వార్టర్ లో వున్నవారు లేగిస్తే ప్రాబ్లమ్ అవుతుందని అమెను శాంతింపజేసేందుకు ప్రభాకర్ రెడ్డితో పాటు రాజీవ్, శ్రావణ్ లు తీవ్రంగా ప్రయత్నించారు. ఇక చేసేది లేక అమెను తీసుకెళ్లండని ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి వారికి చెప్పాడు. ఈ క్రమంలో అమెను శాంతిపజేసేందుకు ఒకసారి శిరీషను రాజీవ్ చెంపదెబ్బ కూడా కొట్టాడు.

ఆ తరువాత కారులో హైదరాబాద్ తిరుగు పయనమైన శ్రావణ్ కు రెండు పర్యాయాలు ఫోన్ చేసిన ఎస్ఐ తన పీఎస్ పరిధి దాటి వెళ్లిపోయారా లేదా..? అని కూడా ఎంక్వైరీ చేశాడు. ఇక కారులో వస్తుండగా కూడా డోర్ తసీుకుని దూకేసేందుకు శిరీష రెండు సార్లు ప్రయత్నించింది. దీంతో కారు స్పీడ్ తగ్గించిన రాజీవ్.. అమెను జుట్టు పట్టుకుని కారులోపలికి ఈడ్చి పడేశాడు. దీంతో మార్గమద్యంలో రాజీవ్ ను యు ఆర్ ఏ బీచ్ అని తిట్టడంతో.. అమెపై మరోమారు చేయిచేసుకున్నాడు రాజీవ్. ఇక అమెను ఓదార్చుతూ.. శాంతపర్చుతూ నెమ్మదిగా హైదారాబాద్ చేరుకున్నారు. తన స్కూటీ అపీసులోనే వుండటంతో.. అది తీసుకుని వెళ్తానని అమె చెప్పడంతో రాజీవ్, శ్రావణ్ లు కిందే ఉండిపోయారు. అయితే శిరీష్ ఒక్కతే పైకి వెళ్లింది.

శిరీషది నిజంగా ఆత్మహత్యేనా..? మరి రాజీవ్ ఏం చేస్తున్నాడు..?

ఇక తాను వస్తుందిలే నేను వెళ్తానని శ్రావణ్ చెప్పడంతో.. అతని కోసం క్యాబ్ బుక్ చేశాడు రాజీవ్. ఈ క్రమంలో అతని సెల్ కు అఫీసులో వున్న శిరీష వీడియో కాల్ చేసింది. కానీ అతను క్యాబ్ కోసం కాల్ చేస్తూండటంతో దానిని పట్టించుకోలేదు. ఇక క్యాబ్ రావడం.. శ్రావణ్ ను తీసుకువెళ్లిన తరువాత.. శిరీష కాల్ చూసుకున్న రాజీవ్ అమెకు వీడియో కాల్ చేశాడు. స్పందన లేకపోవడంతో వాయిస్ కాల్ చేశాడు. అయినా రిప్లై లేకపోవడంతో.. అనుమానం వచ్చిన రాజీవ్ కార్యాలయంలోకి వెళ్లి చూడగా అమె ఉరివేసుకుని వుంది. దీంతో అమె బతికి వుంటే అవకాశాలు వుంటాయన్న తొందరలో అమె చున్నీతో ఉరిబిగించుకోవడంతో దానిని తీసుందుకు ప్రయత్నించాడు. అయినా అది రాకపోవడంతో.. అక్కడే వున్న బ్లేడుతో దానిని కోసి.. అమెను కిందకు దించాడు. అనంతరం శ్రావణ్ కు ఫోన్ చేసి రమ్మనాడు. అతడు వచ్చాక అపోలో అస్పత్రికి ఫోన్ చేసి అంబులెన్స్ ను రప్పించి అమెను తీసుకెళ్లారు.

ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు కారణమేంటి..?

శిరీష్ ఆత్మహత్య చేసుకుందన్న సమాచారంతో ఇటు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి కూడా అందోళనకు గురయ్యాడు. తాను ఇన్నాళ్లుగా సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు, గౌరవం, మర్యాద మంటగలిసిపోతున్నాయని కంగారుపడ్డాడు. అయినా తన బ్యాచ్ మేట్ హరిందర్ సింగ్ కు అదే రోజు నాలుగు పర్యాయాలు ఫోన్ చేసి వివరాలు తెలసుకున్నాడు. ఇక మరుసటి రోజు మళ్లి హరిందర్ కు ఫోన్ చేయడంతో అతను ఏకంగా ప్రభాకర్ రెడ్డితో..‘‘ మీ క్వార్టర్ లోనే మద్యం సేవించారట కదా..’’ అని అగడటంతో.. అలాంటిదేమీ లేదు అని చెప్పినా.. అతనిలో భయాందోళన మాత్రం అతని బలహీనుణ్ణి చేసింది దీంతో ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి కూడా తన సర్వీసు రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో రాజీవ్, శిరీషలను ట్రాప్ చేసిన శ్రావణ్ ను ఏ-1గా, రాజీవ్ ను ఏ-2గా పేర్కోన్న పోలీసులు.. వీరిని అరెస్టు చేసి వీరిద్దరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : banjara hills  kukunoorpally  RJ photography  beautician  prabhakar reddy  sravan  telangana  crime  

Other Articles