1993 Mumbai serial blasts case TADA court verdict ముంబై పేలుళ్ల కేసులో ఆ ఐదుగురు దోషులే: టాడా కోర్టు

Mustafa dossa abu salem three others found guilty of 1993 mumbai serial blasts conspiracy

1993 mumbai serial blasts verdict, 1993 mumbai blasts, 1993 bombay blasts, mumbai blast, live, 1993 mumbai blasts judgment, 1993 mumbai serial blasts, 1993 mumbai blasts sentence, yakub memon, tiger memon, dawood ibrahim, mumbai blast

A TADA court pronounced its judgment on Friday, against gangster Mustafa Dossa, Firoz Khan and Tahir Merchant finding them guilty of conspiracy in 1993 Mumbai serial bomb blasts case.

ముంబై పేలుళ్ల కేసులో ఆ ఐదుగురు దోషులే: టాడా కోర్టు

Posted: 06/16/2017 12:59 PM IST
Mustafa dossa abu salem three others found guilty of 1993 mumbai serial blasts conspiracy

దేశ ఆర్థిక రాజధాని ముంబైని కుదిపేసిన 1993 వరుస పేలుళ్ల కేసులో టాడా కోర్టు కీలక తీర్పు వెలువరిచింది. ఈ కేసు వెనుకనున్న మాస్టర్ మైండ్ ముస్తాఫా దోసాను ప్రధాన కుట్రదారుగా టాడా న్యాయస్థానం నిర్థారించింది. ఆయనతో గ్యాంగ్ స్టర్ అబుసలేం సహా మరో నలుగురి కూడా న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. మొత్తంగా ముస్తాఫా దోసా, అబుసలేం, ఫిరోజ్ అబ్దుల్ రషీద్ ఖాన్, అబ్దుల్ ఖయ్యూం, రియాజ్ సిద్ధిఖీ, తాహిర్ తక్లా, కరీముల్లాఖాన్ లను దోషులుగా న్యాయస్థానం తీర్పును వెలువరించింది.

ముంబయిలో వరుస పేలుళ్ల కేసులో నిందితుడిపై దాఖలైన అభియోగాలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కుట్ర ఆరోపణలు, హత్య, ఉగ్ర కార్యకలాపాల కింద ముస్తాఫాను న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఇక దోషికి శిక్షను ఖరారు చేయాల్సి వుంది. 1993లో మార్చి 12న సుమారు రెండు గంటల వ్యవధిలోనే 12చోట్ల బాంబు పేలుళ్లు జరగడంతో ముంబయి నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనలో 257 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 700మందికి పైగా గాయపడ్డారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆర్డీఎక్స్‌ను ఉపయోగించి పేలుళ్లకు పాల్పడిన ఘటన ఇదే కావడం గమనార్హం.

ఈ ఘటనలో 2007లో టాడా కోర్టు తొలి దశ విచారణను పూర్తి చేసింది. అందులో 100 మందిని నిందితులుగా గుర్తించగా.. మరో 23 మందిని నిర్దోషులుగా పేర్కొంది. అయితే ఈ ట్రయల్ పూర్తయిన తర్వాత ఈ కేసులో అబు సలెం, ముస్తాఫా దోసా, కరిముల్లా ఖాన్‌, ఫిరోజ్‌ అబ్దుల్‌, రషీద్‌ ఖాన్‌, రియాజ్‌ సిద్ధిఖీ, తాహిర్‌ మర్చంట్‌, అబ్దుల్‌ ఖయ్యుంలను కీలక నిందితులుగా గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పేలుళ్ల కేసులో మళ్లీ రెండో దశ విచారణ చేపట్టారు. రెండో దశలో ముస్తాఫాను న్యాయస్థానం దోషిగా తేల్చింది. అయితే శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. కాగా.. అబుసలెం తదితరులపై ఇంకా విచారణ జరగాల్సి ఉన్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 1993 blasts  mumbai serial blasts  TADA court verdict  1993 mumbai blasts  Mustafa Dossa  crime  

Other Articles