Rajnath, Venkaiah meet Sonia, Yechury for discussion ముసుగు వేసి మద్దతు అడిగితే.. షాక్ తగులుదుంది..!

Rajnath venkaiah meet sonia yechury for discussion

President Poll, Venkaiah Naidu, Rajnath Singh, sonia gandhi, sitaram yechury, Pratibha Patil, Narendra Modi, Pranab mukharjee, presidential elections, bjp

The consultations over the next President gathered momentum with BJP leaders Rajnath Singh and Venkaiah Naidu meeting congress chief Sonia Gandhi on Friday and seeking suggestions for a likely candidate.

ముసుగు వేసి మద్దతు అడిగితే.. షాక్ తగులుతుంది..!

Posted: 06/16/2017 04:35 PM IST
Rajnath venkaiah meet sonia yechury for discussion

తెలుగులో మరీ ముఖ్యంగా తెలంగాణలో ఓక సామెత వుంటుంది. గేదలను చెరువులోకి పంపి.. వాటి కోమ్ములను చూపించి అమ్మడానికి బేరం పెట్టారని.. సరిగ్గా అదే విధంగా వుంది ప్రస్తుతం కేంద్రంలోని బీజేపి పరిస్థితి. రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో.. నరేంద్రమోడీ ప్రభుత్వం అచితూచి అడుగులు వేస్తుంది. తన ప్రభుత్వానికి, పార్టీకి ఎలాంటి పరిస్థితుల్లో అపఖ్యాతి రాకూడదని భావించి.. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తో పాటు వామపక్షాలకు చెందిన కీలక నేతలను ఇవాళ కలసి తమ అభ్యర్థికి మద్దుతు ఇవ్వాలని కోరింది.

ఈ క్రమంలో దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా గమనించిన అధికార ప్రతిపక్షాల మధ్య చర్చలు అత్యంత పేలవంగా ముగిశాయి. అసలు రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో తెలియకుండా ఎవరికని, ఎలాగని మధ్దతును ఇస్తామన్న ప్రతిపక్షాల ప్రశ్నలతో అధికారపక్షం త్రిసభ్య కమిటీ ఖంగుతినింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు కూడగట్టేందుకు ఏర్పాటైన బీజేపీ త్రిసభ్య కమిటీ ఇవాళ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ సోనియా గాంధీని, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరిని కలిసింది. ఒక్కోక్కరితో కమిటి దాదాపు 30 నిమిషాల పాటు భేటీలు నిర్వహించింది.

తొలుత సోనియాను కలిసిన వెంకయ్యనాయుడు, రాజ్ నాథ్ సింగ్ లు.. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో కాంగ్రెస్‌ అభిప్రాయమేమిటో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ‘మీ అభ్యర్థి ఎవరో చెప్పండి.. అవసరమైతే మేమే(ఎన్డీఏనే) మద్దతిస్తాం’ అని బీజేపీ నేతలు సోనియాతో అన్నట్లు సమాచారం. సమాధానంగా.. ‘మద్దతు కోసం వచ్చిన మీరు ఎవరికి మద్దతివ్వాలో ఆ పేరు చెప్పకుంటే ఎలా?’ అని సోనియా అన్నట్లు తెలిసింది.
‘వాళ్లు(బీజేపీ) అభ్యర్థుల పేర్లు చెప్పనేలేదు. అలాంటప్పుడు దీనిని చర్చలని కూడా అనలేం’  అని సోనియాతో బీజేపీ కమిటీ భేటీపై కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌ వ్యాఖ్యానించారు. ‘పేర్లు చెప్పకుంటే ప్రక్రియ ముందుకు సాగనేసాద’ని మరో నేత మల్లిఖార్జున ఖర్గే అన్నారు.

ఆ తరువాత ఎన్డీఏ త్రిసభ్య బేటీ సభ్యులు వెంకయ్య నాయుడు, రాజ్ నాథ్ సింగ్ లతో పాటు నేరుగా సీపీఎం కేంద్ర కార్యాలయానికి వెళ్లి సీతారం ఏచూరిని కలిశారు. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో సీపీఎం అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. భేటీ అనంతరం ఏచూరి మీడియాతో మాట్లాడారు. ‘వాళ్లు వచ్చారు. కొద్దిసేపు మాట్లాడుకున్నాం. అయితే ఎన్డీఏ అభ్యర్థి పేరు మాత్రం చెప్పలేదు. కాసేపటికి వెళ్లిపోయారు. అయినా పేరు చెప్పకుండా మద్దతెలా ఇస్తాం?’ అని ఏచూరి పేర్కొన్నారు. దీంతో ఈ భేటీపై రాజకీయ విశ్లేషకులు స్పందిస్తూ.. ఇది చేతులు కాలకముందే అకులు పట్టుకున్న చందంగా వుందని వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : presidential elections  bjp  venkaiah naidu  sonia gandhi  sitaram yechury  Rajnath singh  

Other Articles