Mumbai doctor films woman colleague changing clothes దుస్తులు మార్చుకుంటుండగా వీడియో తీసీ..

Mumbai doctor who secretly films woman colleagues changing clothes sacked

doctor films lady doctor changing clothes, doctor films woman chanding clothes, Mumbai city news, Mumbai crime, crimes against women, woman filmed changing, theft, video-graphed, Doctor, Cooper Hospital, colleagued, arrested, Sunil Ghosalkar, jaiswar, Forensic Science Laboratory, dcp rashmi karandikar, crime

Juhu police arrested a 29-year-old doctor from a government-run hospital in Mumbai for allegedly filming his colleague while she was changing her clothes last month.

దుస్తులు మార్చుకుంటుండగా వీడియో తీసీ..

Posted: 06/16/2017 12:20 PM IST
Mumbai doctor who secretly films woman colleagues changing clothes sacked

వైద్యో నారాయణో హరి అంటూ వైద్యులను దేవుడితో స‌రిసమానాంగా భావించే సమాజం మనది. అలాంటి ఉన్నతమైన హోదాలో కొనసాగుతున్న కొందరు వైద్యులు మాత్రం సమాజంలో సిగ్గుమాలిన పనులు చేసి.. సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. కీచ‌కుల్లా వ్యవహరిస్తూత‌మ శాడిజాన్ని ప్రద‌ర్శిస్తుంటారు. తమతో పాటు ఉద్యోగం చేస్తున్న తోటి మహిళా వైద్యురాలు అన్న విషయాన్ని కూడా మర్చిపోయి.. అమె ఓ గదిలో దుస్తులు మార్చుకుంటుండగా రహస్యంగా వీడియో తీశాడు. అక్కడితో ఆగాడా? లేదు. ఆ వీడియోను వాట్సప్ ద్వారా త‌న స్నేహితులంద‌రికీ పంపించాడు.

ముంబై జుహూ ప్రాంతంలోని డాక్ట‌ర్స్ క్వార్టర్స్‌లో చోటు చేసుకుంది. జుహూ స‌మీపంలో ప్రభుత్వ వైద్యుల కోసం ప్రభుత్వం ఓ క్వార్టర్స్ నిర్మించింది. అందులో ప‌లువురు ప్రభుత్వ వైద్యులు నివాసం ఉంటున్నారు. ఓ మహిళా డాక్టర్‌ దుస్తులు మార్చుకుంటుండగా అదే అంతస్తులో ఉన్న 29 ఏళ్ల వైద్యుడొక‌డు ఆ ఘటనను రహస్యంగా వీడియో తీశాడు. ఈ వీడియో కాస్త వాట్సాఫ్ లో షేర్ అవ్వుతూ.. ఏకంగా బాధిత మ‌హిళా వైద్యురాలి స్నేహితురాలికి చేరింది.

ఈ వీడియో చూసి అమో షాక్ కు గురైంది. విషయాన్ని బాధిత మహిళా వైద్యురాలి వద్దకు తీసుకెళ్లింది. తొలుత నమ్మని బాధితురాలు.. వీడియో చూసిన తరువాత నిర్ఘాంతపోయింది. గత కొన్నాళ్లుగా తన పట్ల కొందరు వైద్యులు అదోలా చూడటానికి కారణం ఇదేనా.. అని తెలుసుకున్న బాధితరాలు.. ఈ వీడియో ఎక్కడి నుంచి వ‌చ్చింద‌నే విష‌యంపై ఆరా తీశారు. మ‌కు వ‌చ్చిన వాట్సప్ నంబ‌ర్లకు ఫోన్ చేసి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. తీరా- ఓ డాక్టర్‌ నుంచి వచ్చిందని తేలింది. దీంతో ఆమె జుహూ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ డాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఉన్నతాధికారులు దృష్టికి కూడా విషయం వెళ్లడంతో అతడి ఉద్యోగానికి కూడా ఎసరు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mumbai crime  crimes against women  doctor  lady doctor  woman filmed changing  theft  crime  

Other Articles

Today on Telugu Wishesh