ED files charge sheet against Vijay Mallya అడిపోసుకోవడం అపండన్న మాల్యాకు ఈడీ షాక్..

Ed files its first charge sheet against vijay mallya files its first charge sheet against vijay mallya

Vijay Mallya, Mallya, chargesheet, ED, Enforcement Directorate, ED files chargesheet, IDBI bank loan default case, Rs 900 crore, Kingfisher Airlines, KFA, extradition, CBI, Central Bureau of Investigation

Enforcement Directorate has filed a chargesheet against liquor baron Vijay Mallya today in the Rs 900-crore IDBI Bank loan default case.

విర్రవీగినందుకు విజయ్ మాల్యా ముక్కుకు ఈడీ తాడు..

Posted: 06/14/2017 05:51 PM IST
Ed files its first charge sheet against vijay mallya files its first charge sheet against vijay mallya

భారత దేశ ప్రజల ధనాన్ని అప్పనంగా దోచుకుని విదేశాలకు వెళ్లి మళ్లీ అదే విలాసాలు, రాజభోగాలను అనుభవిస్తూ.. ఏకంగా టీమిండియా పాకిస్థాన్ మ్యాచ్ కు వచ్చి మరీ వీక్షించిన మాల్యా.. తాను మళ్లీ మళ్లీ మ్యాచ్ చూడటానికి వస్తాను అని.. విర్రవీగిన విషయం తెలిసిందే. అలాంటి మాల్యా మొన్న సౌతాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా స్టేడియంలోకి వెళ్తున్న మాల్యాను దోంగ, దోంగ అంటూ భారత యువత అరవడంతో..షాక్ కు గురైన అర్థిక నేరస్థుడు చడీ చప్పుడు లేకుండా స్టేడియంలోకి జారుకున్నాడు.

దీంతో చిర్రెత్తుకోచ్చిన మాల్యా.. తనపై ఇంతటి దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారంటూ ఏకంగా మీడియాను అడిపోసుకున్నాడు. తనను దోంగ అన్న యువకులను ఎదరించలేక.. కేవలం ఇద్దరు తాగుబోతులు మాత్రమే అరిచారని మిగతా వారు తనకు విషెస్ చెప్పారని అన్నారు. లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టులో భారత్ కు మాల్యాను అప్పగించాలన్న వాజ్యంపై విచారణ సందర్భంగా.. తాను భారతీయ బ్యాంకులకు ఏమీ బాకీ లేనని చెప్పాడు. అందుకు తగిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పాడు ఇలాంటి అబద్దాలతో న్యాయస్థానం నుంచి ఆరుమాసాల పాటు బెయిల్ కూడా తెచ్చుకున్నాడు.

ఇలా లండన్ కోర్టులో స్వల్ప ఊరట లభించిన మాల్యాకు ఈడీ షాక్ ఇచ్చింది. ముంబై పీఎంఎల్‌ఏ కోర్టులో బుధవారం మొట్టమొదటి చార్జ్‌షీట్‌​ఫైల్‌ చేసింది. ఉద్దేశ పూర్వక భారీ రుణ ఎగవేత దారుడిగా తేలిన మాల్యాపై ఎట్టకేలకు అధికారంగా ఐడీబీఐ రూ.900 కోట్ల కేసులో చార్జ్‌షీటను నమోదు చేసింది. బ్యాంకులకు వేలకోట్ల రుణాలను ఎగవేసి లండన్‌కు పారిపోయిన మాల్యాను దేశానికి రప్పించడం అంత ఈజీ పని కాదని అక్కడి న్యాయస్థానం అనుమతి తీసుకన్న తరువాత అతడ్ని తీసుకువస్తామని కేంద్రమంత్రి వ్యాఖ్యలను తోసిపుచ్చుతూ ఈడీ చార్జిషీటు దాఖలు చేయడంపై భారతీయులు హర్షం వ్యక్తం చే్స్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay Mallya  chargesheet  ED  Enforcement Directorate  extradition  CBI  latest news  

Other Articles