pregnant-woman-denied-ambulance-service-citing-unavailability-of-fuel యోగీ రాజ్యంలోనూ పేదలకు అందని ద్రాక్షగా సేవలు..

Pregnant woman denied ambulance service citing unavailability of fuel

Kaushambi, saharanpur, pregnant lady, cycle, community health centre, ambulance, uttar pradesh, odisha, latest news

Denied an ambulance by Govt hospital, man carries body of 7 month old niece on his cycle in Kaushambi of uttar pradesh. A Community Health Center in Saharanpur allegedly denied ambulance service to a pregnant lady citing unavailability of fuel.

యోగీ రాజ్యంలో అమానుషం.. పేదలకు అవి అందని ద్రాక్ష

Posted: 06/14/2017 03:33 PM IST
Pregnant woman denied ambulance service citing unavailability of fuel

ఉత్తర్ ప్రదేశ్ పరిపాలనా పగ్గాలను అందుకునే సమయంలో తనకు ప్రధాన మంత్రి తనకు మూడు వర్గాలను కంటికి రెప్పలా కాపాడాలని చెప్పారని, వారిలో దళితులు, రైతులు, పేదలు వున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ అదిత్యనాథ్ తెలిపిన విషయాన్ని ఆయన రాష్ట్రంలోని వైద్యాధికారులు, అస్పత్రి సిబ్బంది మాత్రం లక్ష్యపెట్టడం లేదు. దళితులు, పేదలకు అన్న తేడా లేకుండా అత్యవసర పరిస్థితుల్లో వున్న వారికి అంబులెన్స్ సర్వీసులు అందించాల్సిన అస్పత్రి వర్గాలు తలా తోక లేని కారణాలు చెప్పి వారికి సేవలను అందించేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు.

అసుపత్రులకు ప్రజారోగ్యం పేరుతో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్లు రూపాయలను బడ్డెట్ లలో కేటాయింపులు చేస్తున్నా.. దేశ రాజధాని వున్న రాష్ట్రంలోనే పేదలకు అంబులెన్స్ సేవలు కరువయ్యాయి. నెలలు నిండిన నిండు గర్భీణి అస్పత్రికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో అమెకు కష్టంగా మారడంతో.. అంబులెన్స్ సేవలను కోరింది. అమె తరపు బంధువులు కూడా వెళ్లి అక్కడి ఉన్నత అధకారులను కోరారు. అయినా సిబ్బంది వచ్చి.. అంబులెన్సులో డీజిల్ లేదని.. చెప్పి.. అందుచేత వేరే వాహనాలను తీసుకుని వెళ్లాలని సూచించారు.

ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని సహరన్ పూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఇవాళ చోటుచేసుకుంది. నిండు గర్బిణికి అడగకుండానే సేవలందించాల్సిన వైద్య సిబ్బంది.. డీజిల్ లేదన్న సాకును చూపి సేవలను విస్మరించారు. అయితే అసలు అంబులెన్సులో డీజిల్ వుందా..? లేదా..? అన్న విషయం మాత్రం క్లారిటీ లేదు. మరి అస్పత్రికి వస్తున్న నిధులు ఎక్కడికి వెళ్తున్నాయ్. ఏమైపోతున్నాయ్ అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. అంబులెన్సులలో డీజిల్ లేదన్నప్పుడు ఇక వాటిని నడిపే డ్రైవర్లకు కూర్చోబెట్టి జీతాలను ఎందుకిస్తున్నారన్న విషయం అర్థకాని ప్రశ్నగా మారింది.

ఇప్పటికీ ఇదే రాష్ట్రంలో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. తన మేనకోడలును చికిత్స చేయించడానికి తీసుకువచ్చిన వ్యక్తి అమె మరణించడంతో.. వైద్యాధికారులను అంబులెన్స్ సేవల కోసం అడిగాడు. అయితే అస్పత్రి వర్గాలు నిరాకరించడంతో తన మేనకోడలు బౌతికకాయాన్ని తన భుజంపై వేసుకుని తన సైకిల్ పై తన స్వగ్రామం కౌషంబికి వెళ్లిన వార్త వెలుగులోకి వచ్చిన ఇంకా 24 గంటలు కూడా గడవక ముందే మరో గర్భణీ కి కూడా అదే తరహా అనుభవం ఎదురుకావడంతో.. యూపీ వాసులు వైద్యాధికారులపై మండిపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles