arab country toddler photo becomes viral on social media రోజుల శిశువు.. భలే ఫోజుతో నెట్ లో వైరల్

Arab country toddler photo becomes viral on social media

days baby photo viral, toddler photo goes viral, just born baby photo viral, netzens comments on viral photo, toddler, just born baby, twitter, saudi arabia, viral phots, latest news

Juast a days old toddler became hero of the social media with his photo pose, who unknowingly kept his two hands just like an young guy on his bed. this was shared by netzens and became a viral news along with viral photo.

రోజుల శిశువు.. భలే ఫోజుతో నెట్ లో వైరల్

Posted: 06/14/2017 02:41 PM IST
Arab country toddler photo becomes viral on social media

అంతర్జాలం అందుబాటులోకి వచ్చిన తరువాత దాని గురించి ఏమాత్రం తెలియని వాళ్లు కూడా నెట్ జనుల ప్రశంసలకు నోచుకుంటున్నారు. నమ్మశక్యంగా లేదా..? కానీ ఇది నిజం. అనేక సందర్భాల్లో మనవాళ్లు అనుకోకుండా తీసిన వీడియోలు.. నెట్ లో సంచలనంగా మారుతున్నాయి. అది కాస్తా తీవ్ర ప్రచారం జరిగిన తరువాత కానీ వాల్లకు తాము నెట్ లో హల్ చల్ చేస్తున్నామన్న విషయం తెలియడం లేదు. అయితే అలాంటి సంఘటనే ప్రస్తుతం నెట్టింట్లో సంచలనంగా మారింది.

ఈ శిశువు పుట్టి కేవలం రోజులే అవుతుంది. అయితేనేం మంచి ఫోజు పెట్టి దీర్ఘఅలోచనలో పడ్డాడు. శిశువు అలా ఫోజు పెట్టి ఏదో అలోచనలోకి జారుకున్న సందర్భంలో గమనించిన అతని తల్లిదండ్రులు అతనిని ఫోటో తీశారు. దానిని కాస్తా నెట్ లో పెట్టి పెట్టగానే చూసిన నెట్ జనులు కామెంట్లను పెడుతూ.. అతడి జోస్యం చెబుతున్నారు. తలకింద పెట్టుకొని.. రిలాక్స్డ్ గా పడుకొన్న ఈ చిన్నారిని చూస్తే.. రాజసాన్ని ఒలకబోస్తున్నట్టు ఉంది కదూ అని ఒకరు.. రజనీ కాంత్ స్టైల్ ని మించిపోయిన మరో స్టైలిష్ యాక్టర్ అని మరోకరు ఇలా ఎవరితోచిన విధంగా వారు కామెంట్లు పెడుతున్నారు.

ఒక వైపు విపరీతమైన లైక్ లు, మరోవైపు షేర్లు, ఇంకో వైపు కామెంట్లతో సోషల్ మీడియాలో ఈ శిశువు హోరెత్తిస్తున్నాడు. దీంతో అతిపిన్న వయస్సులో ట్విట్టర్ హీరో అయిపోయాడంటూ నెట్ జనులు తెగ పోగిడేస్తున్నారు. ఇక ఈ శిశువుపై కామెంట్ల వర్షం కురుస్తుంది ఎవరెవరెలా స్పందించారో.. వారి కామెంట్లేంటో చూద్దామా..

* చిన్నోడు పుట్టగానే.. వీడు ఇంజినీర్ అవుతాడని వాళ్ల నాన్న అనుకొని ఉంటాడు.
* రాజ్యాంగ సవరణలు చేయాలని భావిస్తున్న అంబేద్కర్ లా వున్నాడు.
* కచ్చితంగా వీడు యంగెస్ట్ సోషల్ మీడియా హీరో
* అర్ధరాత్రి దాటిన తర్వాత ఫ్యాషన్ ఛానెల్ లో న్యూడ్స్ గురించి ఎదురు చూస్తున్నట్టున్నాడు
* పెద్దోడు అయిపోయాడు

ఇలా రకరకాల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు నెటిజన్లు. ఏదేమైనా… చిన్నారి ఫొటో మాత్రం చూసిన ప్రతి ఒక్కరినీ అకట్టుకుంటుంది. అంతమందిని ఆశ్చర్యానికి గురిచేస్తున్న చిన్నారి నిజంగానే సోషల్ మీడియా హీరో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : toddler  just born baby  twitter  saudi arabia  viral phots  latest news  

Other Articles