Wife Attacks Husband for Checking WhatsApp conversation

Woman attacks husband with sickle for checking her phone

Wife Whats App Chat, Wife WhatsApp And Call Records, Wife Attack with Sickle, Husband Checking Wife Phone, Wife Checking Husband Phone, Woman Attack on Husband, UP Wife Whats App Attack, Sickle Attack, Wife Sickle Attack

Uttar Pradesh Woman Allegedly Attacks Husband With A Sickle After He Tried To Check Her WhatsApp And Call Records. Later Both are arrested Husband Safe.

భార్య వాట్సాప్ ఛాట్ మొత్తం చూసేశాడని...

Posted: 06/13/2017 08:45 AM IST
Woman attacks husband with sickle for checking her phone

అక్రమ సంబంధాలు అనుబంధాలను బొంద పెట్టేస్తున్నాయి. పెళ్లయ్యాక కూడా రోజురోజుకీ దిగజారి ప్రవర్తిస్తున్న వారు ఎందరో. ప్రియుడి కోసం భర్తను వదిలేసిన ఓ భార్య దారుణానికి తెగబడింది. తన అనుమతి లేకుండా భర్త  చేసిన పనితో మంటపుట్టి అతన్ని నరికి ప్రియుడితో పరారైంది.

ఉత్తరప్రదేశ్ లోని ఖేరాఘ‌ర్ లోని భిలావ‌లి గ్రామానికి చెందిన నేత్రాపాల్ కు 2014 లో నీతూ సింగ్ తో వివాహం అయ్యింది. అయితే అప్పటికే ఓ యువకుడిని ప్రేమించిన నీతూ సింగ్ పెద్దవాళ్ల బలవంతం మేరకు పెళ్లి చేసుకున్నట్లు నేత్రాపాల్ కు అర్థమైంది. దీంతో భార్యను వదిలేసి విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఇంతలో కుటుంబంలో ఓ వేడుకకు హాజరైన ఈ ఇద్దరు ఎదురు పడ్డారు. భార్య పదే పదే ఫోన్ లో బిజీగా ఉండటంతో చిర్రెత్తుకొచ్చిన ఆ భర్త దాన్ని లాక్కుకున్నాడు. ఆపై ప్రియుడితో నీతూ చేసిన వాట్సాప్ ఛాట్ మొత్తం చూసేశాడు.

బలవంతంగా ఫోన్ ను లాగేసుకోవటంతో ఆగ్రహానికి గురైన నీతూ ఆవేశంలో అతనిపై దాడి చేసింది. కొడవలితో తలపై నరికింది. దీంతో బంధువులు అతనిని ఆసుపత్రికి తరలించారు. ఈ హడావుడిలో భయానికి గురైన నీతూ ప్రియుడితో పరారైంది. చివరకు బంధువులను వారిద్దరిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. అయితే తమ ప్రేమకు అడ్డు తగిలేందుకు నేత్రాపాల్ తనకు తానే గాయం చేసుకున్నాడని నీతూ ఆరోపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttar Pradesh  Whats App Chat  Wife Attack  

Other Articles