Lalu backs Wife Rabri Devi Sanskari bahu Comments

Rabri devi sanskari bahu comments rucks

RJD Chief Lalu Prasad Yadav, Lalu Wife, Lalu Wife Controversy, Sanskari Bahu, Sanskari Bahu Rabri Devi, Rabri Devi Comments, Lalu Rabri, Lalu Prasad Yadav and Rabri Devi, Rabri Devi with Sons

RJD Chief Lalu Prasad Yadav wife Rabri Devi Sanskari Bahu Comments Create Rucks. She wants daughters-in-law who "will respect them, abstain from trips to the mall, and run the house smoothly. Later Lalu Definition of That and Clarity in Twitter of Wish List.

కోడలా కోడలా... రచ్చ రచ్చ

Posted: 06/13/2017 08:19 AM IST
Rabri devi sanskari bahu comments rucks

బీహార్ మాజీ సీఎం, రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య, రబ్రీ దేవి అమ్మాయిలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తన ఇద్దరు కొడుకులకు పెళ్లీడు వచ్చిందని చెబుతూ తనకు ఎలాంటి కోడలు కావాలో పేర్కొన్న ఆమె ఆ క్రమంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన లాలూ స్వయంగా వివరణ ఇచ్చుకున్నాడు.

సంస్కారి బాహు(సాంప్రదాయమైన కోడలు) అంటే వంటింటి కుందేలుగా ఉంటూ భర్త పై ఆధారపడి ఉండటం కాదు. ధృడ సంకల్పం, ప్రేమానురాగాలు ఉన్న అమ్మాయి. అలాంటి అమ్మాయి ఉద్యోగం చేసినా ఫర్వాలేదు అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. బీహార్ యువ నేతలుగా, మంత్రులుగా ఉన్నతేజ్ ప్రతాప్ యాదవ్, తేజశ్వి ప్రసాద్ యాదవ్‌లకు సాంప్రదాయమైన అమ్మాయిలను చూస్తున్నట్టు లాలు సతీమణి రబ్రీదేవి పేర్కొన్న విషయం తెలిసిందే. మాల్స్‌కు, షికార్లకు వెళ్లే అమ్మాయిలను కాకుండా గ్రామీణ యువతులను చూస్తున్నట్టు చెప్పింది.

లాలు 70వ జన్మదిన వేడుకల సందర్భంగా రబ్రీ పై వ్యాఖ్యలు చేసింది. తన తర్వాత ఇంటిని జాగ్రతగా చూసుకునే అమ్మాయిలు కావాలని, పెద్దలను గౌరవించగలగాలని, తనలాగా బయట పనులను చక్కదిద్దుకునే అమ్మాయిలే తనకు కోడళ్లుగా సరిపోతారని రబ్రీ పేర్కొనటంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. అమ్మాయిలంటే ఇంట్లోకి కుక్కిన పేలులా పడుండలా అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీంతో లాలూ ఇలా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lalu Prasad Yadav  Rabri Devi  Sanskari Bahu Comments  

Other Articles