Punjab Congress Government on Farmers loan waiver

Punjab may announce relief for farmers

Punjab Congress, Punjab Farmers, Farmers Loan Waiver, Punjab Loan Waiver, Punjab Congress Government, Punjab Farmers, Farmers Protest, BJP Congress Loan Waiver

Punjab Congress Government may announce 'relief' for farmers. A committee led T Haque, a former chairman of the Commission for Agricultural Costs and Prices, is working on the waiver plan. The committee invited the farmer unions to share their views on June 15.

కాంగ్రెస్ మాత్రం అలర్ట్ అయ్యిందిగా...

Posted: 06/13/2017 09:54 AM IST
Punjab may announce relief for farmers

ఓవైపు ఒక్కో రాష్ట్రాన్ని తమ ఖాతాలో వేసుకుంటున్నామని ఆనంద పడేలోపే బీజేపీకి అక్కడి సమస్యలు కూడా గుదిబండలా తయారయ్యాయి. యోగి ఆదిత్యనాథ్ లాంటి దూకుడు నిర్ణయాల సీఎం విషయంలో కూడా అది తప్పటం లేదు. ఇది చాలదన్నట్లు రైతుల రుణమాఫీ అనే జఠిల సమస్య ఇప్పుడు బీజేపీ పెద్ద చిక్కు తెచ్చిపెడుతోంది.

యూపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇలా ప్రతీ రాష్ట్ర ఎన్నికల టైంలో మేనిఫెస్టోలో అన్నదాతలకు వరాలు ప్రకటించేసింది కమలం. కానీ, ఆచరణ లో మాత్రం అది అమలు కావటం లేదు. దీంతో రోడెక్కిన రైతులు నిరసన జ్వాలలు వెల్లగక్కారు. క్రమంగా ఇది పొరుగున ఉన్న ఇతర రాష్ట్రాలకు కూడా పాకటం ప్రారంభించింది. ఈ క్రమంలో పంజాబ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం ముందు జాగ్రత్త తీసుకుంది. ఆందోళనలు ఉదృతం కాకముందే నిపుణుల కమిటీ వేసి త్వరగతిన రుణ మాఫీ ప్రకటించేయాలని చూస్తోంది.

అమరీందర్ సింగ్ ప్రభుత్వం నుంచి ఈనెల 20న ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రైతుల డిమాండ్‌పై ఆర్థిక శాఖామంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ మాట్లాడుతూ.. కమిటీ 17న తన నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఏమేమి ప్రతిపాదనలు చేసిందో తాను చెప్పలేనని, అది అసెంబ్లీ ముందుకే వస్తుందన్నారు. అధికారంలోకి వస్తే రైతు రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చామని, దానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆయన తెలిపాడు.

ఇంకోవైపు రైతుల రుణమాఫీ భారం రాష్ట్రాలదే అన్న ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటన నేపథ్యంలో పంజాబ్ గనుక పూర్తి స్థాయి మాఫీ చేస్తే మాత్రం బీజేపీిని ఏస్కోడానికి ఓ మాంచి టాపిక్ ప్రతిపక్షాలకు దొరికినట్లే అవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Punjab  Farmers Protest  Loan Waiver  

Other Articles