CM Shivraj Chouhan Peace Fast amid Farmers Protest

Blood on his hands mp cm peace drama

Madhya Pradesh, Chief Minister Shivraj Singh Chouhan, Shivraj Singh Chouhan Protest, CM Peace Fast, Farmers Protest, Chief Minister Protest

Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan Sit for Peace Protest at Bhopal due to Farmers Chaos. Farmers and Congress called it as Big Drama.

రక్తం మరకలు.. శాంతి సందేశం

Posted: 06/10/2017 08:43 AM IST
Blood on his hands mp cm peace drama

మధ్యప్రదేశ్ లో రైతులపై జరిగిన కాల్పులు, ఐదుగురు మృతిచెందాక పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి. ఆందోళనలను మరింత ఉధృతం చేయటంతో కట్టడి చేసేందుకు చేస్తున్న యత్నాలు ఫలించటం లేదు. పోలీసుల లాఠీ ఛార్జీలు, అరెస్టుల పర్వాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ స్వయంగా రంగంలోకి దిగాడు.

మంద్‌సౌర్‌ ఘటనను ఖండిస్తూనే శాంతి నెలకొనేవరకు నేటి నుంచి నిరవధిక నిరాహారదీక్షకు దిగుతానని ప్ర‌క‌ట‌న చేశారు. భోపాల్‌లోని దసరా మైదానంలో త‌న‌ దీక్షను ప్రారంభించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. ప్రజ‌లు త‌మ సమ‌స్య‌ల‌పై ఆ మైదానంలోనే త‌న‌తో చ‌ర్చించ‌వ‌చ్చ‌ని చెప్పాడు. ఘటనపై పోలీస్ విచారణ కొనసాగుతుందని, కాల్పులు జరిపింది ఎవరో స్పష్టత లేదని, దోషులు ఎవరైనా సరే చట్టం నుంచి తప్పించుకోలేరని తెలిపాడు.

కాగా, వ‌చ్చే ఏడాదే ఆ రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌డంతో అక్క‌డ అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీకి పెద్ద చిక్కే వ‌చ్చిప‌డింది. రైతుల రక్తాన్ని తన చేతులకు పూసుకుని ఆనందిస్తున్నాడంటూ కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తోంది. అదే సమయంలో ఇదంతా ఉత్త డ్రామానే అని రైతులు కూడా విమర్శిస్తున్నారు. అయితే ఆందోళనలను అదుపు చేయలేకపోతున్న శివరాజ్ పై కమల అధిష్ఠానం గుర్రుతో ఉన్నప్పటికీ, పదవికి వచ్చిన ఎసరు మాత్రం ఏం లేదని అంతర్గత వర్గాల సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madhya Pradesh  CM Shivraj Singh Chouhan  Peace Protest  

Other Articles

Today on Telugu Wishesh