topper Varshil Shah turns to be a Jain monk now ఇంటర్ టాపర్ ఎంచుకున్న కెరీర్ సూపర్..!

Gujarat student varshil shah who scored 99 99 opts to be monk

gujarat, gujarat class 12 topper, varshil shah, Teenager, Gujarat, topper, monk, Varshil Shah, Suvirya Ratna Vijayji Maharaj, muni suvirya ratna vijayji, education news, india news

17 year-old Varshil Shah, who scored 99.99 percentile in the Class XII exam of the Gujarat state board, topping in the commerce stream, became a Jain monk

ఇంటర్ టాపర్ ఎంచుకున్న కెరీర్ సూపర్..!

Posted: 06/09/2017 04:04 PM IST
Gujarat student varshil shah who scored 99 99 opts to be monk

నేటి తరం పిల్లలు తమ కెరీర్ విషయంలో చాలా ముందస్తుగా ప్రణాళికలు వేసుకుని వాటిని సాధించేందుకు కష్టపడుతున్నారు. ఈ విషయంలో ఎలాంటి రాజీకి కూడా తావులేదని చాటిచెబుతున్నారు. ఈ నేపథ్యంలో వారు పిన్న వయస్సు నుంచే ఈ ఫోటీలను పునికిపుచ్చుకుంటున్నారు. మరోలా చెప్పాలంటే పాఠశాల స్థాయి నుంచి తాము సాధించే మార్కుల విషయంలో.. తాము సంపాదించిన విజ్ఞానం, వివేకం విషయంలో అవే కొలమానమని వారు బావిస్తున్నారు. ఈ విషయంలో వారి తల్లిదండ్రులు కూడా విద్యార్థుల తరహాలోనే వుంది. పిల్లల కోసం.. వారి కెరీర్ కోసం ఎంతటి కష్టాలకైనా సిద్ధం అంటున్నారు.

అయితే గుజరాత్ ఇంటర్ టాపర్ ఎంచుకున్న కెరీర్ తెలిస్తే షాక్ అవుతారు. గుజరాత్ ప్లస్ టూలో టాపర్ గా నిలిచిన ఒక విద్యార్థి అసాధారణ నిర్ణయం తీసుకుని తన కెరీర్ లో అసలు బ్రేకులు లేకుండా చేసుకున్నాడు. ఐఎస్ఎస్ కావాలంటే చాలా కష్టపడాలి.. ఇంజనీర్, డాక్టర్, లాయర్, ఇలా ఏ కెరీర్ తీసుకున్నా.. కొద్దిగా కష్టపడాలి. అయితే కెరీర్ ఏదైనా తాము ఉన్నత శిఖరాలకు చేరాలన్నదే అంతిమ ధ్యేచయంగా పెట్టుకుంటారు విద్యార్థులు. కానీ ఎంత ధైర్యం, ఎంత తెగువ.. ఎంత త్యజించే గుణం, ఎంత శాంతం, ఎంత సహనం వుంటే కానీ ఒక సన్యాని కాలేరు. హరిషట్ వర్గాలను పిన్నవయస్సులో అదుపులో పెట్టుకుని పయనం సాగించడం ఎంత కష్టం.

అవును నిజమేనండీ 17 ఏళ్ల వయస్సులో బాలబాలికలకు మంచి, చెడు అన్నవాటి విభజనలో ఇంకా అక్షరాభ్యాసమే జరుగుతుంది. కానీ వాటి గురించి లొతుగా తెలియదు. ఒకవేళ తెలిస్తే అంటారా.. 17 ఏళ్ల తరువాత ఏ ఒక్కరు తప్పులు చేయకూడదు. ీ విషయాన్ని పక్కనబెడితే..  ఇటీవల వెలువడిన 12వ తరగతి పరీక్షల్లో ఏకంగా 99.99 శాతం మార్కులు సాధించిన గుజరాత్ యువకుడు వర్షిల్ షా ఇకపై తన చదువు మార్కులు వచ్చేందుకు కాదు జ్ఞానాన్ని పెంచేందుకు.. పరమాత్మకు సన్నిహితులయ్యందు దోహదపడాలని నిర్ణయించుకున్నాడు. అందుకనే ఏకంగా సన్యాసం తీసుకుని తన కెరీర్ ను మలుచుకున్నాడు.

కళ్యాణ్ మహరాజ్ అనే జైన సన్యాసిని స్ఫూర్తిగా తీసుకొని షా ఈ నిర్ణయానికి వచ్చి సూరత్ లో సన్యాసం స్వీకరించాడు.నిజానికి షా మాత్రమే కాదు.. ఆయన కుటుంబీకులు  కూడా కాస్తంత భిన్నమైన ఆలోచన ధోరణి ఉన్నవారే. విద్యుత్ను ఉత్పత్తి చేసే ప్రక్రియలో భాగంగా అనేక జలచరాలు చనిపోతాయన్న ఉద్దేశంలో కరెంటు వాడకాన్ని వీలైనంత తక్కువగా వారి కుటుంబం వినియోగించటం గమనార్హం. వారింట్లో ఇప్పటికి టీవీ.. ఫ్రిజ్.. లాంటివి ఏమీ ఉండవు. షా సోదరి కూడా సీఏ చదువుతూ మధ్యలోనే చదువును ఆపేశారు. షా కుటుంబంలో ఆధ్యాత్మిక భావాలు ఎక్కువని వారి గురించి తెలిసిన వారు చెబుతున్నారు. ప్లస్ టూలో అద్భుతమైన మార్కులు సాధించిన కుర్రాడు ఎంచుకున్న మార్గం ఇప్పుడు అందరికి ఆశ్చర్యంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Teenager  Gujarat  topper  monk  Varshil Shah  Suvirya Ratna Vijayji Maharaj  

Other Articles