Supreme Court stays Aadhaar card link to PAN card ఆ రెండింటికీ లింకు పెట్టకండీ.. పెట్టారో..?

Supreme court stays aadhaar card link to pan card

Aadhaar, PAN Card, Supreme Court, aadhaar, sc order, sc pan card, pan card details, aadhaar news, supreme court, aadhaar order

Supreme Court stayed the government's order to make Aadhaar card mandatory for PAN holders and said it can't be made mandatory for filing Income Tax returns.

ఆ రెండింటికి అస్సలు లింకు పెట్టకండి

Posted: 06/09/2017 02:46 PM IST
Supreme court stays aadhaar card link to pan card

దేశ వ్యాప్త అదాయపన్నుదారులను ఎంతో ఉత్కంఠకు గురిచేస్తున్న అంశం లింక్. అధార్ కార్డును అదాయ అంశాలతో ముడిపెట్టి లింక్ చేయడంపై కేంద్రం తీసుకువచ్చిన తాజా సవరణలకు చెక్ పడింది. ఈ విషయంలో కేంద్రానికి మరోమారు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఓటరు కార్డుతో అధార్ కార్డును లింక్ చేయాలని కేంద్ర ఉత్తర్వులు జారీ చేసినప్పడు కూడా కేంద్రానికి ఇలాంటి ఝలకే తగిలింది. అయినా తమ నిర్ణయాన్ని మార్చుకోకుండా ఆధార్ కార్డును అన్నింటితో లిక్ చేయాలని మోడీ సర్కార్ భావించింది.

ఆదార్ కార్డుతో ప్యాన్ కార్డును లింక్ చేసే అంశంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం తాజాగా స్టే విధించింది. జస్టిస్ ఏకే సిక్రీ, అశోక్ భూషన్ లతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య బెంచ్ ఈ మేరకు ఇవాళ ఇరువర్గాల వాదనలను విన్న తరువాత అధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేయడం సమంజసం కాదని అభిప్రాయపడింది. పాన్ కార్డుతో ఆధార్‌ కార్డు అనుసంధానాన్ని తప్పనిసరిచేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు నిలువరింపజేసింది. అంతేకాదు అదాయపన్ను రిటన్స్ చెల్లింపులలోనూ ఇది తప్పనిసరి కాదని చెప్పింది.

ఈ మేరకు దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో ప్రజలను బలవంతంచేయడం తగదని సూచించింది. ఆధార్‌ లేకపోయినా కూడా ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేయవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఇప్పటి ఐటీ రిటన్స్ దాఖలు చేసే సమయంలో అధార్ నెంబర్లను పొందుపచ్చాలని సూచించింది. ఎట్టి పరిస్థితుల్లో అధార్ తో పాన్ కార్డును లింక్ చేయరాదని చెప్పిన న్యాయస్థానం.. పౌరుల వ్యక్తిగత వివరాలు జాగ్రత్తగా భద్రపర్చేందుకు కొత్త విధానం కోసం కేంద్రం కసరత్తు చేయాలని అదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles