Telugu Youth Shot In California అగ్రరాజ్యంలో మరో తెలుగు యువకుడిపై హత్యాయత్నం..

Telugu youth shot in california family seeks government help

indian youth shot in california, telugu youth shot in california, Mubeen ahmed shot in california, another telugu youth shot in america, sangareddy youth shot in california, mubeen ahmed, masters in engineering, private store, eden medical center, castro valley, chicago, california, telangana, crime

A 26-year-old youth was injured when he was shot by an unidentified assailant in California. The victim, Mubeen Ahmed, a native of Sangareddy district went to US for pursuing his Masters in February 2015.

అగ్రరాజ్యంలో మరో తెలుగు యువకుడిపై కాల్పులు..

Posted: 06/08/2017 11:08 AM IST
Telugu youth shot in california family seeks government help

అగ్రరాజ్యం అమెరికాలో జాతి విద్వేషకుల అగ్రహానికి మరో తెలుగు యువకుడు జీవన్మరణాల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అక్కడి నల్లజాతీయులకు తెలుగు యువకుడి మధ్య ఏదో చిన్న విషయమై రేగిన వివాదం విషాధాన్ని నింపింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ ఘటన జరిగింది. అదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకోగా, తమ అబ్బాయి విషయంలో తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితుడి తండ్రి మంత్రి హరీష్ రావును అభ్యర్థిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను తనకు అప్పగించాలని ఇప్పటికే భారత్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మస్వరాజ్ సంబంధింత అధికారులను అదేశించారు.

వివరాల్లోకి వెళ్తే.. అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లి ఎంఎస్ పూర్తి చేయాలన్న అశతో వెళ్లిన సంగారెడ్డి జిల్లా వాస్తవ్యుడు ముబీన్ అహ్మద్.. 2015లో కాలిఫోర్నియాకు చెందిన ఓ యూనివర్శిటీలో చేరాడు. గత రెండు మాసాల క్రితం ఆయన తన ఎంఎస్ పూర్తి చేసుకున్నాడు. దీంతో అక్కడే తనకు ఉపాధి కోసం అన్వేషిస్తున్న ముబీన్..  ఖాళీగా వుండటం ఇష్టం లేక కాలిఫోర్నియాలోని ఓ ప్రైవేటు స్టోర్ లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో అదివారం సాయంత్రం కొందరు నల్లజాతీయులు వచ్చి తమకు కావాల్సిన సరుకులను తీసుకున్నారు.

అయితే బిల్లు చెల్లింపుల విషయంలో ముబీన్ కి నల్లజాతీయులకు మధ్య మాటమాట పెరిగింది. దీంతో కోపోద్రిక్తులైన నల్లజాతీయులు వెంటనే తమ జేబులోంచి తుపాకీని తీసి ముబీన్ పై కాల్పలు జరిపారు. తూట నేరుగా ముబీన్ కడుపులోకి దూసుకెళ్లి.. లీవర్ కు డ్యామేజ్ చేసింది. రక్తపు మడుగులో పడివున్న ముబీన్ కాస్ట్రో వ్యాలీలోని ఈడెన్ మెడికల్ సెంటర్ అస్పత్రికి తరలించిన స్టోరు యాజమాన్యం అక్కడ అయనకు సర్జీరీ చేయించింది. అయినా అతని పరిస్థితి ఇంకా విషమంగానే వుందని వైద్యులు చెప్పారు.

అమెరికాలోని చికాగోలో వుంటున్న ముబీన్ బంధువులు అస్పత్రికి చేరుకుని అతని పరిస్థితిపై వైద్యులను వాకాబు చేస్తూ.. ఇటు సంగారెడ్డిలోని అతని తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. దీంతో సికింద్రాబాద్ మిలటరీ క్యాంటీన్ లో విధులు నిర్వహిస్తున్న ముబీన్ తండ్రి ముజీబ్ అమ్మద్.. తెలంగాణ మంత్రి కె.హరీష్ రావును కలుసుకుని వెంటనే తెలంగాణ ప్రభుత్వం తమ బిడ్డను అదుకోవాలని విన్నవించారు. ఇదిలావుండగా, ఈ ఘటనపై సమగ్ర నివేదికను సమర్పించాలని కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ అమెరికాలోని భారత రాయభార కార్యాలయ అధికారులను అదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles