Bodies And Debris Found From Missing Myanmar Military Plane

Debris from myanmar military plane found in sea

Myanmar Military Plane, Myanmar News, Myanmar Plane Accident, Myanmar Plane Mishap, Myanmar Andaman Sea, Missing Plane Sea, Plane Debris Andaman sea, Myanmar Plane Debris, Myanmar Dead Bodies Sea, Dead Bodies Float Sea, Plane Fall in Sea, Myanmar Missing Plane

Myanmar Military Plane missing with 120 passengers over Andaman Sea. Debris of plane and bodies with over 100 on board found in Andaman sea.

ఘోర ప్రమాదం.. సముద్రంలో తేలుతున్న శవాలు

Posted: 06/08/2017 10:12 AM IST
Debris from myanmar military plane found in sea

మయన్మార్ లో పెను విషాదం చోటు చేసుకుంది. సుమారు 120 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఓ సైనిక విమానం అదృశ్యమైన విషయం తెలిసిందే. అండమాన్ సముద్రంలో అది కుప్పకూలిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 105 మంది ప్ర‌యాణికులు, మ‌రో 11 మంది సిబ్బందితో మయన్మార్ కు చెందిన వై-8ఎఫ్-200 విమానం బయలుదేరింది.

బుధవారం ద‌క్షిణ ప్రాంత న‌గ‌ర‌మైన మ‌యిక్, యాంగూన్ మ‌ధ్య విమానం గ‌ల్లంతైన‌ట్లు ఆర్మీ చీఫ్ వెల్లడించాడు. మ‌ధ్యాహ్నం 1.35 నిమిషాల‌కు విమానంతో కమ్యూనికేష‌న్ తెగిపోయింది. 20 మైళ్ల దూరం వెళ్లిన త‌ర్వాత విమానంతో సంబంధాలు పూర్తిగా క‌ట్ అయ్యాయి. గాలింపు చర్యల తర్వాత విమానం సముద్రంలో కూలిపోయిందని అధికారులు ప్రకటించారు. దవాయ్ పట్టణానికి 218 కిలోమీటర్ల దూరంలోని సముద్రంలో శకలాలను గుర్తించారు.

నాలుగు నౌకాదళ నౌకలు, రెండు ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానాలు ఈ గాలింపు చేపట్టగా, లుంగ్లాన్ ప్రాంతంలో మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. విమానం కూలిన ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న నౌకలకు ఓ వ్యక్తి, మహిళ, చిన్నారి మృతదేహంతో పాటు లగేజీ బ్యాగ్ లు, సేఫ్టీ జాకెట్లు, విమానం టైరు నీటిపై తేలియాడుతూ కనిపించాయి. ఈ ఉదయం 8:25 గంటల ప్రాంతంలో పలువురి మృతదేహాలను గుర్తించినట్టు మయన్మార్ సైనిక ప్రతినిధి మీడియాకు వెల్లడించాడు. దీంతో ప్రయాణికులంతా జలసమాధి అయినట్టు భావిస్తున్నామని, ఏ ఒక్కరూ బతికే అవకాశం లేదని వారు చెబుతున్నారు.

కాగా, ప్రయాణికుల్లో 90 మంది ఆర్మీ కుటుంబాలకు చెందినవారని, వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని అధికారులు చెబుతున్నారు. వీరిలో 15 మంది చిన్నారులు, 35 మంది సైనికులు, 14 మంది విమానం సిబ్బంది కాగా, మిగిలిన వారు సైనికుల కుటుంబీకులని ఆర్మీ చీఫ్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. చిన్నారుల్లో అత్యధికులు యాంగాన్ లో వైద్య పరీక్షలకు వెళుతున్నారని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Myanmar  Military Plane Mishap  Andaman Sea  

Other Articles