Low lying areas inundated Due to Heavy Rain in Hyderabad

Monsoon hits hyderabad heavy rains

Hyderabad, Hyderabad Weather, Hyderabad Heavy Rains, Hyderabad, Traffic police Hyderabad Rains, Hyderabad Rains, Low lying areas inundated, Hyderabad Moosi River Rains, Hussain Sagar Level Heavy Rains, Hyderabad Roads Rains Damage, GHMC Heavy Rains

Monsoon hit Telugu States. Heavy rain in Hyderabad. People Face Traffic Problems, Low lying areas inundated.

ITEMVIDEOS:ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ రియల్ ఫెస్టివల్

Posted: 06/08/2017 09:45 AM IST
Monsoon hits hyderabad heavy rains

కురిసింది ఓ మోస్తరు భారీ వర్షమే. కానీ, పరిస్థితి మాత్రం ఘోరంగా మారిపోయింది. గతేడాది అనుభవాలను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ సర్కార్, జీహెచ్ ఎంసీలు ముందస్తు చర్యలు తీసుకుంటుందని భావిస్తే, అలా ఏ మాత్రం జరిగిన దాఖలాలు కనిపించటం లేదు. నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. మూసీ పరిస్థితి కూడా ఆల్ మోస్ట్ ఇలాగే ఉంది. రోడ్లన్నీ ఎక్కడిక్కడే నీట మునిగిపోయాయి.

నిన్నటి వరకూ నీరు లేక బోసిపోయిన హుస్సేన్ సాగర్, తెల్లారేసరికి నిండుకుండలా కనిపిస్తోంది. నగర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవగా, పంజాగుట్ట, ఉప్పల్, అంబర్ పేట రోడ్ నంబర్ 6, తాజ్ కృష్ణా జంక్షన్, అమీర్ పేట ఇమేజ్ ఆసుపత్రి, కేసీపీ జంక్షన్, బేగంపేట న్యూవే, నింబోలి అడ్డా, చింతల్ బస్తీ గోల్నాక, పుత్లీబౌలీ, సీబీఎస్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై ఒకటిన్నర నుంచి రెండు అడుగుల ఎత్తున వర్షపు నీరు పారుతోంది. పలు ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. నగరంలోని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది.

హుస్సేన్ సాగర్ కు దారితీసే నాలాలన్నీ పొంగి పొరలుతున్నాయి. రోడ్లపై నిలిచిన నీటిని సాధ్యమైనంత త్వరగా తొలగించేందుకు జీహెచ్ఎంసీ అత్యవసర బృందాలు రంగంలోకి దిగాయి. అయితే చిన్నపాటి వర్షాలకే పరిస్థితి ఇలా ఉంటే.. మున్ముందు భారీ వర్షాలు ఉండటంతో ఇంకా పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంటుందోనని భాగ్యనగర వాసులు భయపడిపోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  Heavy Rains  GHMC  

Other Articles