Virgin Flight Evacuated After Bathroom Bomb Hoax కిటికీల్లోంచి దూకేయండీ.. ఫైలట్ అదేశంతో ప్రయాణికుల బెంబేలు..!

Virgin pilot wins praise for its lightning quick response to bomb hoax

Virgin Flight Evacuated After Bathroom Bomb Hoax, virgin pilot praised, pilot bomb alert, virgin pilot bomb threat, Virgin, airlines, pilot, praised, quick, response, bomb, threat, hoax

Virgin Airlines staff have been praised for jumping to action during a fake bomb scare on a flight from Sydney to Albury

కిటికీల్లోంచి దూకేయండీ.. ఫైలట్ అదేశంతో ప్రయాణికుల బెంబేలు..!

Posted: 06/07/2017 09:46 PM IST
Virgin pilot wins praise for its lightning quick response to bomb hoax

ఆ పైలెట్ ఏకంగా హీరో అయ్యాడు. అస్ట్రేలియా వాసులు పైలట్ అప్రమత్తతను ప్రశంసిస్తూ.. పోగడ్తలతో ముంచెత్తుతున్నారు.వర్జిన్ ఎయిర్‌ లైన్స్‌ విమానం పైలట్ కు ఒక్కసారిగా అంత ఫాలోయింగ్ ఏంటబ్బా అనుకుంటున్నారా..? ఆసలు పైలట్ ఏం చేశాడు.. ఏ విషయంలో అప్రమత్తత ఆయన హీరోను చేసింది..? అన్న సందేహాలు కలుగుతున్నాయా..? ఎయిర్ హోస్టెస్ చేప్పిన విషయం విన్న పైలట్.. వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేయడాన్ని అక్కడి నెట్ జనులు ప్రశంసిస్తున్నారు.

ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే... వర్జిన్ ఎయిర్ లైన్స్ కి చెందిన విమానం ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి అల్బురీ ఎయిర్ పోర్ట్ కి బయల్దేరింది. రమారమి ల్యాండింగ్ అయ్యినా.. రన్ వే పైనుంచి నిర్ణత స్థలంలోకి వెళ్తి అగబోతున్న సమయంలో.. పైలట్ ప్రయాణికులను మైక్ ద్వారా అప్రమత్తం చేశారు. సరిగ్గా అంతకు ముందు బాత్రూంలోకి వెళ్లిన ఎయిర్ హోస్టెస్ పరుగున వచ్చి పైలట్ వద్దకు వెళ్లి విషయం చెప్పగానే ఆయన ప్రయాణిాకులను ఉద్దేశిస్తూ.‘‘ఖాళీ చేయండి... ఖాళీ చేయండి.. మీ సామాన్లన్నీ వదిలిపెట్టి విండోలో నుంచి దూకేయండి’’ అంటూ ఆదేశించారు.

దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు. అంతలో మరోమారు పైలట్ 'ఎమర్జెన్సీ విండోస్ ద్వారా కిందకి దూకేయండి' అని అనౌన్స్ చేశాడు. దీంతో ప్రయాణికులంతా బ్రతుకు జీవుడా అంటూ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ద్వారా బయటకు దూకేశారు. అనంతరం భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహించి, 30 ఏళ్ల ఓ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణం మధ్యలో బాత్రూంలోకి వెళ్లిన ఆ వ్యక్తి అక్కడ ఒక లేఖ పెట్టాడని పోలీసులు తెలిపారు.

ఆ వ్యక్తి రాసిన లేఖలో ‘‘చంపేస్తా... శరీరం ముక్కలయ్యేలా హింసిస్తా’’ అంటూ అందులో రాశాడని, దానిని చూసే ఎయిర్ హోస్టెస్ కంగారుపడి, పైలెట్ కు చెప్పి అందర్నీ హడలెత్తించిందని ఆస్ట్రేలియా పోలీసులు తెలిపారు. విచారణలో 'ఇదంతా సరదా కోసం చేశా'నని సదరు ప్రయాణికుడు చెప్పడం కొసమెరుపు. దీంతో సదరు ప్రయాణికుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరిన్ని కొణాల్లో విచారిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virgin  airlines  pilot  praised  quick  response  bomb  threat  hoax  

Other Articles