Man carries wife's body on bike అమానుషం: భార్య శవాన్ని బైక్ పై తీసుకెళ్లిన భర్త..

Man carries wife s body on bike after govt hospital denied mortuary van

Body on motorcycle, Purnia sadar hospital, Bihar incident, Civil surgron MM Wasim, DM Pankaj Pal, Shankar sah, Deceaseds husband, purnia, Sadar hospital, Medical staff, Mortuary van, Susheela devi, motorcycle, hospital, van, labourers, Bihar

A poor labourer in Purnia district of north-eastern Bihar took home the body of his wife on a motorcycle, on Friday, after the authorities at a district hospital, in which she died, failed to provide him a mortuary van.

అమానుషం: భార్య శవాన్ని బైక్ పై తీసుకెళ్లిన భర్త..

Posted: 06/05/2017 11:13 AM IST
Man carries wife s body on bike after govt hospital denied mortuary van

ప్రభుత్వ అసుపత్రి వర్గాలు అమానుషం ఇందుగలదు అందు లేదు అన్న సందేహము వలదు అన్నట్లు ఏ రాష్ట్రం చూసినా.. ఏ జిల్లా చూసినా అందందు స్పష్టంగా కనిపిస్తుందన్న విమర్శలు వినబడుతున్నాయి. ఒడిశాలోని ఓ గిరిజనుడు తన భార్య శవాన్ని బస్సులోంచి దించివేస్తే.. తన భుజాన వేసుకుని తన గూడేనికి తీసుకెళ్లిన ఘటన  నమోదైన నాటి నుంచి ఇప్పటి వరకు అనేక మంది పేదలు ప్రైవేటు వాహనాలకు డబ్బులు చెల్లించే స్తోమత లేక తమకు అందుబాటులో వున్న మార్గాల ద్వారా శవాలను తీసుకువెళ్తు వార్తల్లో నిలుస్తున్నారు.

పేదలకు మార్చూరీ వాహనాలను అందించేందుక అస్పత్రి వర్గాలు నిరాకరించి.. అందుకుగాను చివరకు రకరకాల కథలు చెబుతూ.. ఆ కల్పిత కథలనే అసలైన కారణాలుగా నిజం చేస్తున్నారు. తాజాగా బీహర్ లో కూడా ఇలాంటి ఘటనే నమోదైంది. అస్పత్రి వర్గాలు అమానుషంగా వ్యవహరించి మార్చూరి వ్యాన్ ను ఇవ్వడానికి నిరాకరించడంతో ఓ భర్త తన భార్య మృత దేహాన్ని బైక్ పై ఇంటికి తరలించాడు. భీహార్ లోని పూర్ణియా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

జిల్లాలోని రణిబరి గ్రామానికి చెందిన శంకర్ షా (60), సుశీల దేవి (50) భార్యాభర్తలు. ఇటీవల అనారోగ్యం కారణంగా పుర్ణియా  సదర్ ఆసుపత్రిలో చేరిన సుశీల.. పరిస్థితి విషమించడంతో శుక్రవారం మరణించింది. అంత్యక్రియల కోసం ఆమె మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు శంకర్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆస్పత్రి సిబ్బంది మార్చురీ వ్యాన్ ఇచ్చేందుకు నిరాకరించారు. ప్రైవేటు వాహనాన్ని ఏర్పాటు చేసుకునే స్తోమత లేకపోయింది.

దీంతో తన కుమారిడికి బైక్ తీసుకురమ్మని ఫోన్ చేసి.. అదే బైక్ మధ్యలో తల్లి మృతదేహాన్ని పెట్టి వెనక తండ్రి కూర్చోగా ఇంటికి తరలించారు. ఆస్పత్రి సిబ్బందిని వేడుకున్నా అంబులెన్స్ ఇవ్వలేదని, ప్రైవేటు వాహనం డ్రైవర్ రూ.1500 అడిగాడని శంకర్ వివరించాడు. ఇది చాలా బాధాకరమైన విషయమని, ఆసుపత్రిలో ఒకే ఒక్క మార్చురీ వ్యాన్ ఉందని, ప్రస్తుతం అది కూడా పనిచేయడం లేదని సర్దార్ ఆసుపత్రి సివిల్ సర్జన్ వాసిమ్ తెలిపారు. ఈ ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ పంకజ్ కుమార్ పాల్ విచారణకు ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles