4 terrorists killed after they attacked CRPF camp at Sumbal సీఆర్పీఎఫ్ క్యాంపుపై ఉగ్రదాడి.. నలుగురు హతం

Four militants killed in an attack on crpf camp in bandipora

bandipora terrorist attack, sambal terrrorist attack, Attack on CRPF camp in JK,sumbhal, Jammu and kashmir, CRPF, Bandipora, Attack on CRPF Camp in Kashmir, jammu and kashmir, kashmir terror attack, bandipora, sambal, crpf camp,

Four militants were killed on Monday at Sambal, Bandipora district of Jammu and Kashmir by CRPF, after they attacked a CRPF camp.

సీఆర్పీఎఫ్ క్యాంపుపై ఉగ్రదాడి.. నలుగురు హతం

Posted: 06/05/2017 08:41 AM IST
Four militants killed in an attack on crpf camp in bandipora

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోమారు పేట్రేగిపోయారు. బందీపోర జిల్లాలో సీఆర్పీఎఫ్ క్యాంప్ పై ఇవాళ వేకువ జామున దాడికి పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన భారత భద్రతా బలగాలు ఉగ్రవాదులపై ప్రతిదాడులకు పాల్పడటంతో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం తెల్లవారుజామున బందిపొరా జిల్లాలోని సంబల్‌ వద్ద గల సీఆర్‌పీఎఫ్‌ 45వ బెటాలియన్ ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.

భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చిన ఉగ్రవాదులు భద్రతా దళాలు క్యాంప్ ను టార్గెట్ గా చేసుకున్ని.. ముందుగా సెంట్రీ పోస్టుపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు కౌంటర్ ఎటాక్ చేపట్టాయి. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి వద్ద నుంచి ఏకే 47 తుపాకులతో పాటు ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆత్మాహుతి దాడికి పాల్పడే ప్రణాళికతో ఉగ్రవాదులు క్యాంప్‌పై దాడి చేశారని అధికారులు తెలిపారు. కశ్మీరులో ఉగ్రవాద చర్యలకు నిధులు సమకూర్చుతున్నారనే ఆరోపణలతో పాకిస్తాన్‌కు చెందిన నేతలు, వ్యాపారుల సంస్థలు, నివాసాలలో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ దాడి జరగడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jammu and kashmir  kashmir terror attack  bandipora  sambal  crpf camp  

Other Articles

Today on Telugu Wishesh