ISRO to launch India's heaviest satellite GSLV Mk III today నింగిలోకి దూసుకెళ్లనున్న ఇస్రో ‘బాహుబలి’

Gslv mk iii isro to launch india s most powerful rocket today

isro gslv mark III, isro gslv, gslv launch, gslv launch china, gslv launch chinese media, gslv launch china reaction, geosynchronous launch vehicle, india isro, isro launch, isro fat boy, isro monster rocket, india satellite, indian space research organisation, india space, india rocket, gslv mark 3, gslv mk 3, gsat, gsat 19, gslv satellite, satellite launch, isro satellite launch, all about gslv mk 3

ISRO will launch India’s heaviest satellite Geosynchronous Satellite Launch Vehicle Mark III (GSLV Mk III) today. The successful lift off of the satellite will help India launch 4-ton class of satellites of foreign countries,

నింగిలోకి దూసుకెళ్లనున్న ఇస్రో ‘బాహుబలి’

Posted: 06/05/2017 09:35 AM IST
Gslv mk iii isro to launch india s most powerful rocket today

అంతరిక్ష ప్రయోగాల్లో ప్రపంచస్థాయి గుర్తింపుపొందిన భారత్‌.. మరో కీలక మైలురాయిని అధిగమించేందుకు రంగం సిద్దం చేసుకుంది. కేఏ బ్యాండు, కేయూ బ్యాండ్ ట్రాన్స్ ఫాండర్లతో నింగిలోకి దూసుకెళ్లి 4జీ టెక్నాలజీని మరింత మెరుగుపర్చేందుకు మరో ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనుంది. భారీ ఉపగ్రహాలను సొంతంగా ప్రయోగించే లక్ష్యంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2 దశాబ్దాల కృషితో రూపొందించిన జియోసింక్రనస్‌ ఉపగ్రహ ప్రయోగ వాహకనౌక (జీఎస్‌ఎల్‌వీ)-మార్క్‌3డీ1 ను ఇవాళ సాయంత్రం 5.28 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది.

అధునాతన పరిజ్ఞనంతో నింగిలోకి దూసుకెళ్లనున్న ఉపగ్రహా పదేళ్ల పాటు సేవలను అందించనుండటంతో.. దానిని నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టేందుకు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం- షార్‌లో ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ప్రయోగానికి ముందు నిర్వహించే కౌంట్‌డౌన్ ప్రక్రియ క్రితం రోజు మధ్యాహ్నం 3.58 గంటలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 25.30 గంటలపాటు కొనసాగిన అనంతరం షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ నింగిలోకి దూసుకెళుతుంది. పూర్తి స్వదేశీ తయారీ, ఇప్పటి వరకు ఇస్రో ప్రయోగించిన రాకెట్లలో కెల్లా అత్యంత పెద్దదైన ఈ జీఎస్‌ఎల్‌వీ.. 3,136 కిలోల బరువుగల జీశాట్‌-19 సమాచార ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.

జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3డీ1 డీటెల్స్..
రాకెట్‌ బరువు 640 టన్నులు. ఎత్తు 43 మీటర్లు. ఇందులో మూడు దశలు ఉంటాయి. మొదటి దశలో ఎస్‌200 మోటార్లు రెండు, రెండో దశలో ఎల్‌110 లిక్విడ్‌ కోర్‌ ఇంజిన్‌, మూడో దశలో సీ25 క్రయోజెనిక్‌ ఇంజిన్‌ ఉన్నాయి. ప్రయోగం అనంతరం 16.20 నిమిషాలకు జీశాట్‌-19 ఉపగ్రహం రాకెట్‌ నుంచి విడిపోనుంది. ఇది భూ అనువర్తిత బదిలీ కక్ష్య (జీటీవో)లోకి 4వేల కిలోలను, దిగువ భూ కక్ష్యలోకి 8వేల కిలోలను మోసుకెళుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Geosynchronous Satellite Launch Vehicle Mark-III  gslv mk iii  India  ISRO  satellite  

Other Articles