'100% penalty against cash transaction of over Rs 2 lakh' అలా చేస్తే.. ఉన్నది డబ్బు.. ఉంచుకున్న డబ్బు పోతుంది..

It warns against cash dealings of rs 2 lakh or more seeks tip off

Black Money, pradhan mantri garib kalyan yojana, Income Tax, Finance Bill, Cash transactions of Rs 2 lakh, Arun Jaitley, demonetisation, IT Department, warnings, fine, Rs.2 lakhs, Cash Deals

Income Tax department warned people against indulging in cash transaction of Rs 2 lakh or more saying that the receiver of the amount will have to cough up an equal amount as penalty.

అలా చేస్తే.. ఉన్న డబ్బు.. ఉంచుకున్న డబ్బు పోతుంది..

Posted: 06/03/2017 03:36 PM IST
It warns against cash dealings of rs 2 lakh or more seeks tip off

పాత పెద్ద నోట్ల రద్దు తదనంతరం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు గానే కేంద్రం తీసుకువచ్చిన అనేక మార్పులతో ప్రస్తుత అర్థిక సంవత్సరం నుంచి రెండు లక్షల రూపాయలకు మించి నగదు లావాదేవీలు జరిపే ఛాన్స్ లేదు. నోట్ల రద్దు తర్వాత నగదు లావాదేవీలపై సరికొత్త ఆంక్షలను కేంద్రం విధించిన నేపథ్యంలో ఇకపై రెండు లక్షల రూపాయల కన్నా అధికంగా జేబులో, ఇంట్లో డబ్బు వున్నా అది నేరమే. ఈ మేరకు కేంద్ర వార్షిక బడ్జెట్ పొందుపర్చి చట్టంగా చేసిన విషయం తెలిసో తెలియకో నగదు లావాదేవీలు చేస్తున్న వారిని అదాయ పన్ను శాఖ అధికారులు మరోసారి హెచ్చరించారు.

అర్థిక లావాదేవీలను నగదు రహితంగా మార్చేందుకు కేంద్ర తీసుకువచ్చిన ఈ కొత్త చట్టం ముందుగా 3 లక్షల రూపాయల లిమిట్ విధించి.. ఆ తరువాత దానిని 2 లక్షలకు కుదించారు. దీంతో ఇకపై రూ.2లక్షలు.. అంతకు మించిన నగదును లావాదేవీలు జరిపితే.. ఇక వారు జరిమానాలకు కట్టాల్సిందే. ఈ జరిమానాలు ఏ విధంగా వుంటాయో తిలిస్తే షాక్ అవ్వాల్సిందే. రెండు లక్షలకు మించి ఎంత మేర నగదు లావాదేవీలు జరిగితే.. అంతే మొత్తంలో జరిమానా విధిస్తామని ఆదాయపన్ను శాక అధికారులు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు.

మరి రూ.2 లక్షలకు మించిన లావాదేవీలను ఎలా చేయాలన్న ప్రశ్న మీ మదిని తొలుస్తుందా..? ఇకపై ఇలాంటి అన్ని లావాదేవీలను డిజిటల్ బాటలోనే జరపాలి. దీంతో మీ బ్యాంకు ఖాతాలో ఎంత మేర జమ అవుతుంది. ఎంత మేరకు వెళ్తుందన్న విషయాలు అదాయపన్ను శాఖ అధికారులకు బ్యాంకు అధికారుల నుంచి వివరాలు వెళ్తాయి. దీంతో ప్రతీ ఒక్కురు దేశప్రగతి కోసం తమ వంతుగా అదాయ పన్నును సక్రమంగా చెల్లించే అవకాశం వుంటుంది. అందుకనే ఈ విధమైన నిబంధనను కేంద్రం తీసుకువచ్చింది.

నల్లధనాన్ని అరికట్టేందుకు వీలుగా తాజా రూల్ ను తీసుకొచ్చేశారు. సో.. రూ.2లక్షలు.. అంతకు మించిన మొత్తాన్ని కానీ నగదు రూపంలో చెల్లిస్తుంటే.. వెంటనే దానికి చెక్ చెప్పండి. లేదంటే అడ్డంగా బుక్ కావటమే కాదు.. భారీ ఎత్తున జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఇక భారీగా నగదు లావాదేవీలు జరుగుతున్న వివరాలను తమకు తెలియజేయాల్సిందిగా కూడా అదాయపన్ను శాఖ ప్రజలను కోరింది. ఈ మేరకు ఎవరైనా సమాచారం ఇవ్వవచ్చని తమ తమ ఈ మెయిల్ అడ్రస్ This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. కూడా ప్రజలకు ఇచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : demonetisation  IT Department  Income tax  cash transactions  warnings  fine  Rs.2 lakhs  Cash Deals  

Other Articles