congress leader vh gits bracelet to jagga reddy అధినేత మాటను జవదాటడప్ప.. ఈ కట్టప్ప..

V hanumanth rao gifts bracelet to jagga reddy as rahul directs

vh presents bracelet to jaggareddy, vh keeps rahul funny words, rahul gandhi vh jaggareddy, sangareddy meeting sucess gift, v, hanumantha rao, rahul gandhi, jagga reddy, congress, bracelet, telangana

Telangana congress leader v hanumanth rao gifts his golden bracelet to former mla jagga reddy as per the funny directions of congress vice president Rahul Gandhi,

అప్పడు తండ్రి చెంత, ఇప్పుడు తనయుడి వద్ద వీహెచ్ విదేయత

Posted: 06/03/2017 04:38 PM IST
V hanumanth rao gifts bracelet to jagga reddy as rahul directs

కాంగ్రెస్ అధినాయకత్వం వద్ద దగ్గర తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావుకు అంత పలుకుబడి ఎందుకని ఎవరైనా ప్రశ్నిస్తే.. ఏం సమాధానం చెబుతారు..? సమాధానం విషయమేమో కానీ..అయన పార్టీకి విధేయుడు అని మాత్రం చెబుతారు ఎవరైనా. అయన విధేయత ఎలాంటిది అంటే దివంగత ప్రధాని రాజీవ్ గాంధీతో కలసి ఓసారి బోటులో పర్యటిస్తుండగా, నా గురించి ఏమైనా చేస్తామని అంటారు కదా..? మరి ఈ నదిలో దూకగలరా..? అని ప్రశ్నించారట. అంతే ముందు వెనుక అలోచించకుండా ఉన్నఫలంగా నదిలోకి దూకాడట వీహెచ్. అలా రాజీవ్ గాంధీకి అప్పటి సమైక్య తెలుగు రాష్ట్రం నుంచి ప్రియమైన శిష్యుడిగా మారాడు.

ఇక తాజాగా రాజీవ్ గాంధీ తనయుడు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా వీహెచ్ ను సరదాగా ఓ మాట అన్నారు. దాని పరిణమమే తాజాగా ఆయన విధేయతను, కాంగ్రెస్ పార్టీ కట్టప్పను మళ్లి వార్తల్లోని వ్యక్తిగా మార్చేసింది. ఇప్పటికే గాంధీల కుటుంబానికి తాను విధేయుడినన్న విషయాన్ని నిత్యం అంగీకరిస్తు ముందుకు సాగుతున్న వీహెచ్.. అధినేత మాటను అస్సలు జవధాటని కట్టప్పగా మార్చింది.  అందుకు ఆయన మాటలకు పరిమితం కాకుండా చేతల్లో కూడా చేసి చూపుతారు.

తాజాగా సంగారెడ్డిలో నిర్వహించిన ప్రజాగర్జన సభ సందర్భంగా.. ఈ భారీ సభను సింగిల్ హ్యాండ్ తో టేకప్ చేసి సక్సెస్ చేసిన క్రెడిట్ జగ్గారెడ్డిదే అంటూ.. రాహుల్కు పరిచయం చేశారు వీహెచ్. సభ కోసం కోట్ల రూపాయిల్ని ఖర్చు చేశారని గొప్పగా చెప్పారు. దీనికి స్పందించిన వీహెచ్.. మరి మీరేం చేశారని అడగటం.. దానికి సమాధానంగా వీహెచ్.. నా దగ్గర ఏముందని ఇవ్వటానికంటూ బదులివ్వటం.. చేతికి ఉన్న బ్రాస్
లెట్ ను చూపించి.. ఇది ఇవ్వొచ్చు అని సెటైర్ వేయడం తెలిసిందే. ఇదే విషయం మీడియాలో వైరల్ అయ్యింది. .

ఏం అనుకున్నారో ఏమో కానీ.. తాజాగా వీహెచ్ రియాక్ట్ అయ్యారు. తన చేతికున్న బంగారు బ్రేస్ లెట్ ను జగ్గారెడ్డికి ఇచ్చేశారు వీహెచ్. రాహుల్ సరదాగా అన్నప్పటికీ వీహెచ్ ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోవటం గమనార్హంమొత్తానికి తన బ్రేస్ లెట్ ను జగ్గారెడ్డికి ఇచ్చేయటం ద్వారా గాంధీ ఫ్యామిలీకి తాను రియల్ కట్టప్ప అన్న విషయాన్ని వీహెచ్ చెప్పకనే మరోమారు చాటిచెప్పారు. దీంతో కొందరు అప్పుడు తండ్రి చెంత విధేయుడిగా వున్న వీహెచ్.. ఇక తనయుడు వద్ద కూడా అదే విధేయతను చాటుకున్నారని పలువురు చమత్కరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : v  hanumantha rao  rahul gandhi  jagga reddy  congress  bracelet  sangareddy  telangana  

Other Articles