Drunk Russian passenger tries to open plane door mid-air తాగుబొతు సచ్చినోడు.. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం అడాడు..

Drunk russian passenger tries to open plane door mid air

unruly passenger onboard, Passenger Flight Disturbance, Delhi- bound flight, Indira Gandhi International, PTI SLB JC, tipsy passenger, Air Traffic Control, plane mid-air, Blood Alcohol Content, Samokhvalovs medical examination, Aleksander Samokhvalov, Russian national,

There was panic onboard a Delhi- bound flight from Moscow when a tipsy passenger tried to open the door of the plane mid-air.

తాగుబొతు సచ్చినోడు.. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం అడాడు..

Posted: 06/02/2017 09:23 AM IST
Drunk russian passenger tries to open plane door mid air

తాగిబోతు అంటే సంఘంలో గౌరవమే వుండదు. ఇక వారి చేష్టలకు అదిఅంతూ అంటూ ఏమీ వుండదు. ఇలానే ఓ తాగుబోతు సచ్చినోడు ఏకంగా ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడబోయాడు. వెంటనే స్పందిచిన విమాన సిబ్బంది వాడిని అడ్డుకుని కూర్చోబెట్టారు. దీంతో విమానంలోని ప్రయాణికులు అందరూ తీవ్రమైన భయాందోళనకు గురయ్యారు. హుటాహుటిన విమాన పైలెట్ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు సమాచారం అందించారు. విమానం ఢిల్లీకి చేరుకోగానే సదరు ప్రయాణికుడ్ని సీఐఎస్ఎఫ్ సిబ్బంది అతడ్ని అదుపులోకి తీసుకున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. రష్యా నుంచి భారత్ వచ్చే విమానంలో పూటుగా తాగిన రష్యా జాతీయుడు అలెగ్జాండర్ సమోక్ వాల్ అనే ప్రయాణికుడు తోటి ప్రయాణికుల ప్రాణాలతో ఆడుకోబోయాడు. మద్యం మత్తులో తానేం చెస్తున్నాడన్న విషయాన్ని కూడా మర్చిపోయాడు. అసలు తానున్నది ఎక్కడ అన్న విషయం కూడా తెలుసుకోలేని స్థితిలో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం అడబోయాడు. విమాన సిబ్బంది  వేగంగా ప్రతిస్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.

రష్యా రాజధాని మాస్కో నుంచి దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరిన ఏరోఫ్లాట్ ఎస్యూ 232 రకానికి చెందిన విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం రష్యా నుంచి బయలు దేరిన కొన్న గంటల తరువాత..  కొన్ని వేల అడుగుల ఎత్తుకి వెళ్లిన అనంతరం పూటుగా తాగి మద్యం మత్తులోకి జారుకున్న అలెగ్జాండర్ విమానం డోర్ తీసే ప్రయత్నం చేశాడు. దీంతో అతనిపై తోటి ప్రయాణికులు సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో వెంటనే చేరుకున్న సిబ్బంది అతని ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అతని తీరుతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ కాగానే... అతనిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles