Man dies for 90 minutes, wakes up two weeks later అద్భుతం.. చనిపోయి.. బతికిన ఇంజనీరు..

Man dies for 90 minutes after accident wakes up two weeks later

Medical Miracle, Man miraculous recovery, engineer recovers after being dead for 90 mins, Man miraculously recovers after being dead for 90 mins, health and well being, back from the dead, miracle, medical miracle, engineer, scanlon, Baltimore, accident, cardiac arrest, doctors, US

TJ Scanlon lay in a pool of his own blood after falling down a 20-feet stairwell, and suffered cardiac arrest while being moved to hospital.

అద్భుతం.. చనిపోయి.. బతికిన ఇంజనీరు..

Posted: 06/02/2017 10:03 AM IST
Man dies for 90 minutes after accident wakes up two weeks later

శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని పెద్దలు అంటుంటారు. ఇది పూర్తి నిజమని రుజువు చేస్తుందీ ఘటన. వెన్నెముక విరిగిపోయి.. కిడ్నీలు, ఊపిరితిత్తులు పనిచేయడం మానేసి.. శరీరం నీలం రంగులోకి మారిపోవడంతో ఇక బతికున్నా లాభం లేదని వైద్యులు తేల్చేశారు. ఈ క్రమంలో గుండె కూడా పనిచేయడం లేదు. దీంతో ఇక మరణిచాడని అందరూ భావించారు. అయితే 90 నిమిషాల పాటు అగిన గుండె.. ఆ తరువాత కొట్టుకోవడం ప్రారంభించింది. వైద్యశాస్త్రానికే సవాలుగా నిలిచిన ఈ కేసులో కోమాలోకి జారుకున్న రోగిని బతికించేందుకు శాయశక్తులా కృషి చేసిన వైద్యులు అతడికి చికిత్స చేయగా, రెండు వారాల తరువాత కళ్లు తెరచి చూశాడు. ఇది వైద్యశాస్త్రంలోనే అద్భుతమని వైద్యులు వ్యాఖ్యానించగా.. వైద్యుల కృషిని స్థానికులు వేనోళ్ల పొడుగుతున్నారు.

మరణం అంచువరకు వెళ్లి వచ్చాడని కష్టాలు చుట్టుముట్టినప్పుడో.. లేక ప్రమాదంలోకి జారుకున్నప్పుడో అందరం చెప్పేమాట. ఏ ఉద్దేశంతో అలా అన్నా.. అటువంటిదే నిజమైన ఘటన అమెరికాలోని బాల్టిమోర్‌లో జరిగింది. యమపురి ద్వారాల వరకు వెళ్లి.. తిరిగి వచ్చాడు బాల్టిమోర్ లోని ఇంజనీరు స్కాన్లన్. 20 అడుగుల ఎత్తైన గోడపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడిన స్కాన్లన్ 90 నిమిషాల పాటు చనిపోయి.. ఆ తరువాత బతికాడు.. ఇన్నాళ్లు కోమాలోకి జారుకున్న ఇంజనీరు ప్రస్తుతం కళ్ల తెరచి చూస్తున్నాడు. లేచి కూర్చుని తన వారిని గుర్తిస్తున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. గోడపై నుంచి కిందపడిన ఇంజినీర్ టీజే స్కాన్లాన్‌ను ఎవరూ చూడలేదు. దీంతో ఆయన పడిన చోటే రక్తపు మడుగులో రెండు రోజుల పాటు అచేతనంగా పడి ఉన్నాడు. రెండు రోజుల తరువాత అతడ్ని అక్కడ పనిచేసే కార్మికులు గుర్తించి సమాచారం అధికారులకు అందించడంతో వెంటనే ఆస్పత్రికి చేర్చారు. ప్రమాదంలో స్కాన్లాన్ చాతీ కింద భాగం చచ్చుబడిపోయిందని, అంత ఎత్తునుంచి పడటంతో  కాళ్లు పనిచేయడం మానేశామని వైద్యులు నిర్థారించారు. పరీక్షలు చేసిన వైద్యలు స్కాన్లస్ ను అస్పత్రికి తరలించే సమయంలో సుమారుగా గంటన్నర పాటు గుండె కూడా అగిపోయిందని తేలిందన్నారు.

దీంతో సాంకేతికంగా స్కాన్లాన్ చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. అయితే ప్రాథమికంగా అస్పత్రిలో చేర్చుకుని చికిత్స అందిస్తున్నా.. అతని శరీరంలోని అవయవాలు పూర్తిగా దెబ్బతిన్నాయని పరీక్షల్లో తేలిందన్నారు. వెన్నుముక్క విరిగిపోయిందని, కిడ్నీలు, ఊపిరితిత్తులు పనిచేయడం మానేశాయాని, దీంతో అతని శరీరం నీలం రంగులోకి మారిందని చెప్పారు. అయితే తమ ప్రయత్నం తాము చేస్తామని చెప్పిన వైద్యులు చికిత్స అందించడంతో రెండు వారాల తరువాత స్కాన్లన్ కళ్లు తెరవడంతో పాటు లేచి కూర్చోగలుగుతున్నాడు. ఇది అద్భుతమని.. వైద్యుల కృషిని శ్లాఘిస్తున్నారు అమెరికన్ వాసులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : medical miracle  engineer  scanlon  Baltimore  accident  cardiac arrest  doctors  US  

Other Articles