Little Boy Gets Power To Decide Dad's Parking Fine In Court తండ్రికి జరిమానా విధించిన ఐదేళ్ల న్యాయమూర్తి

Little boy gets power to decide dad s parking fine in court

Social viral, Judge and little kid decide punishment for kids dad, viral videos, kid judgement, Frank Caprio, rhode island court, viral video, social media, violation of traffic rule, facebook

A video of Frank Caprio letting a 5-year-old Jacob decide punishment for his father, for parking on the wrong side of the street, is going viral on Facebook and people are loving it

ITEMVIDEOS: తండ్రికి జరిమానా విధించిన ఐదేళ్ల న్యాయమూర్తి

Posted: 05/31/2017 08:19 PM IST
Little boy gets power to decide dad s parking fine in court

నీ తండ్రికి ఏ శిక్ష వేయాల‌ని ఓ చిన్నారిని ఓ జ‌డ్జి అడిగిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటికే ‌కోటి మంది వీక్షించారు. వివ‌రాల్లోకి వెళితే కారు రాంగ్ పార్కింగ్ కేసులో కోర్టుకు హాజరు కావాల్సి వచ్చిన ఓ తండ్రి తనతో పాటు త‌న కుమారుడు జాకబ్ ను కూడా కోర్టుకి తీసుకొచ్చాడు. ఆ చిన్నారికి ఐదేళ్లు ఉంటాయి. ఆ చిన్నారిని చూసిన ఆ జడ్జి తన వద్దకు పిలిచాడు. అనంత‌రం త‌న‌ ఒళ్లో కూర్చోబెట్టుకుని కొన్ని మంచి మాట‌లు చెప్పారు.

అనంత‌రం బాలుగు తనతో నిర్భయంగా మాట్లాడగలుగుతాడని భావించిన తరువాత ఓ పిల్లాడికి ఓ చిక్కు ప్రశ్న వేశాడు న్యాయమూర్తి. అదేంటంటే మీ తండ్రికి ఏ శిక్ష విధించాలని బాలుడ్ని అడిగారు. ఆ చిన్నారి ముందు న్యాయమూర్తి మూడు ఆప్షన్లు ఉంచారు. అత‌డి తండ్రికి 90 డాలర్ల జ‌రిమానా, 30 డాలర్ల జరిమానా లేక జ‌రిమానా లేకుండా వ‌దిలేయడంలో ఏదో ఒకటి చెప్పమ‌ని కోరారు. దీంతో ఆ చిన్నారి త‌న తండ్రికి ఏ జరిమానా విధించ‌వ‌ద్దని మాత్రం అన‌లేదు.

అలాగ‌ని 90 డాలర్ల జ‌రిమానా వేయాలని కూడా అన‌లేదు. కింది ఆప్షన్, పై ఆప్షన్ కాకుండా మ‌ధ్యలో ఉన్న 30 డాల‌ర్ల జ‌రిమానా విధించ‌మ‌ని చెప్పాడు. ఎందుకని 30 డాలర్ల జరిమానా విధించాలని న్యాయమూర్తి చిన్నారిని అడిగారు. మరీ ఎక్కువైతే తన తండ్రి కట్టలేరని, అలా అని వదిలేస్తే తన తప్పును తెలుసుకోలేరని.. కాబట్టి 30 డాలర్ల జరిమానా విధించాలని బాలుడు చెప్పాడు. దీంతో నువ్వు మంచి జడ్జివి అంటూ ఆ జ‌డ్జి ఆ చిన్నారిని అభినందించారు. అమెరికాలోని రోడ్ ఐలండ్‌లో గల ప్రొవిన్షియల్ మునిసిపల్ కోర్టులో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన ఈ దృశ్యాలు ఓ న్యూస్ ఛానెల్‌లోనూ వ‌చ్చాయి. ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఈ వీడియోని కేవలం ఒక్కరోజులోనూ కోటి మంది చూశారు... మరెందుకు ఆలస్యం.. మీరూ ఓ లుక్కేయండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles