Madhya Pradesh Minister Beat Child Goes Viral

Mp minister beat child video viral

Madhya Pradesh Minister, MP Minister Beat Child, Minister Beat Child Video, MP Minister Baarat Video, Minister Beat Child, BJP Minister Beat Video, Om Prakash Dhurve Dance, Om Prakash Dhurve Beat Video, MP Minister Controversy

Madhya Pradesh Food and Civil Supplies Minister Om Prakash Dhurve in Another Controversy. Dhurve Danace and beat a deprived, underprivileged boy in a Baraat.

బారాత్ లో మంత్రి ఓవరాక్షన్

Posted: 05/31/2017 10:42 AM IST
Mp minister beat child video viral

కెమెరా కళ్లు తమపై ఉన్నాయని తెలిసి కూడా నేతలు తప్పుల మీద తప్పులు చేస్తూ దొరికిపోతున్నారు. ముఖ్యంగా అధికార పక్షం బీజేపీ నేతలే ఈ లిస్ట్ లో ఎక్కువగా ఉంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ కు చెందిన ఓ మంత్రి చేసిన నిర్వాకం పై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

పౌరసరఫరాల శాఖామంత్రి ఓం ప్రకాశ్ ధ్రువే పిల్లాడిని చితకబాదిన వీడియో ఒకటి నెట్ లో వైరల్ అవుతోంది. ఓ పెళ్లి కి హాజరైన మంత్రి ప్రకాశ్, బారాత్ లో చిందేయసాగాడు. ఇంతలో కొందరు కార్యకర్తలు నోట్ల వర్షం కురిపించటంతో ఏరుకునేందుకు చిన్న పిల్లలు ఎగబడ్డారు. అయితే తాను డాన్స్ చేస్తుంటే అడ్డు వస్తారా? అని ఆగ్రహాం వ్యక్తం చేస్తూ మంత్రి ఓ పిల్లాడిని పట్టుకుని కొట్టసాగాడు. ఆపై మిగతావారిని ఎటు పడితే అటు వారిని విసేరిస్తూ ఇష్టం వచ్చినట్లు బాదటంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ఘటన శివరాజ్‌సింగ్ ప్రభుత్వానికి తలనొప్పి తెచ్చిపెట్టింది. ఆ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో నెటిజన్లు ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక ఈ మంత్రిగారికి ఇలా వ్యవహరించడం కొత్తేంకాదు. ఈ మధ్యే ఓ గ్రామంలో అధికారిక కార్యక్రమానికి హాజరైన ప్రకాశ్, ప్రభుత్వ అధికారులపై బహిరంగంగానే దుర్భాషలాడాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madhya Pradesh  Om Prakash Dhurve  Beat Child Video  

Other Articles