Zakir Naik is seeking citizenship in Malaysia

Controversial islamic preacher master plan for escaping from india

Zakir Naik, Zakir Naik Malaysia, Malaysia Zakir Naik, Zakir Naik Red Corner Notice, Controversial Preacher Zakir Naik, Malaysian Citizenship, Zakir Naik Master Plan

Controversial Preacher Zakir Naik, who is wanted in India to answer money-laundering and terror-related charges, is seeking Malaysian citizenship. But, that the Malaysian government was aware of the seriousness of the accusations against him.

వివాదాల గురువు.. వాట్ ఏ స్కెచ్

Posted: 05/31/2017 09:31 AM IST
Controversial islamic preacher master plan for escaping from india

ఇస్లామిక్ రీసెర్చి ఫౌండేషన్ వ్వవస్థాపకుడు, వివాదాస్పద మత గురువు జకీర్ నాయక్ ఎప్పుడు తిరిగోస్తాడా? ఎప్పుడు అరెస్ట్ చేద్దామా? అని మన పోలీసులు వెయిట్ చేస్తుంటే... జాతీయ దర్యాప్తు సంస్థ నుంచి ఎలా తప్పించుకోవాలో ఫ్లానులు గీసుకుంటున్నాడు.

రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయటం, ఆపై ఎన్ఐఏ ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించడంతో జకీర్ దేశాలు మారుస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో కొన్ని ఏజెన్సీల సాయంతో మలేసియాలో పూర్తి స్థాయిలో స్థిరపడాలని భావిస్తున్నాడంట. జకీర్ ఆ దేశ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే భాతర్ మాత్రం అతడి ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు చర్యలు చేపట్టింది. మలేషియానే కాదు.. ఏ దేశం కూడా పౌరసత్వం ఇవ్వకుండా ఉండేలా ప్రయత్నాలు ప్రారంభించింది.

జకీర్‌పై ఉగ్రవాద ఆరోపణలు ఉన్న విషయం మలేసియాకు తెలుసు కాబట్టి ఆ దేశం అతడి అభ్యర్థనను తిరస్కరిస్తుందని ఓ అధికారి తెలిపారు. బంగ్లాదేశ్ లో దాడి, ఉగ్రవాదం, రెచ్చగొట్టే ప్రసంగాలు, మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న జకీర్ ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించగానే దేశం వదిలిపారిపోయాడు. ప్రస్తుతం ఎక్కడున్నాడన్న విషయంలో స్పష్టత లేకపోయినా అరబ్, సౌదీ అరేబియా, ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాల మధ్య చక్కర్లు కొడుతున్నట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Controversial Preacher  Zakir Naik  Malaysia  

Other Articles