tributes pour in for director dasari narayana rao దర్శక దిగ్గజం దాసరికి సినీ, రాజకీయ ప్రముఖలు సంతాపం..

Tributes pour in for director dasari narayana rao

Dasari Narayana Rao, dasai narayana rao passed away, dasari demise, dasari no more, tollywood mourns for dasari, dasari ill health, dasari kims hospital, dasari hyper tension, dasari respiration, dasari passes away, Dasari Health, Dasari Critical Condition, Dasari Condition Serious, Dasari Again Surgery, Dasari Health Bulliten, Dasari Narayana Rao Serious, Dasari Health Bulliten

tributes pour in for veteran tollywood director and former union minister dasari narayana rao, who passed away in kims hospital at hyderabad today.

దర్శక దిగ్గజం దాసరికి సినీ, రాజకీయ ప్రముఖలు సంతాపం..

Posted: 05/30/2017 08:23 PM IST
Tributes pour in for director dasari narayana rao

టాలీవుడ్ దర్శక దిగ్గజం.. దర్శకరత్న,కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణ రావు మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి, ఏపీ మంత్రులు నారా లోకేష్, శిద్దా రాఘవరావు, తెలంగాణ మంత్రులు కడియం శ్రీహరి, జగదీశ్ రెడ్డి, ఎంపీ డి.శ్రీనివాసరావు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు.

సినీ రంగంలో ఎంతో మందిని ప్రోత్సహించి వారి ఎదుగుదలకు కారణమైన ఆదర్శప్రాయుడు దాసరి అని కేసీఆర్ అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమను హైదరాబాద్ కు తీసుకురావడంలో ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుంటుందన్నారు. దాసరి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తనకంటూ ఓ విశిష్టతను, ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి దాసరి అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు ఎనలేని సేవలందించారని.. ఎన్టీఆర్ తో చాలా సినిమాలు తీశారని చెప్పారు. ఆయన మరణం చాలా బాధాకరమని చెప్పారు. దాసరి, భార్య పద్మ తనను ఓ కుటుంబ సభ్యుడిలా చూసేవారని గుర్తు చేసుకున్నారు. రాజకీయంగానూ ఆయన రాణించారని.. కేంద్రమంత్రిగా సేవలందించారని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

దాసరి మరణం చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చిత్ర పరిశ్రమ ఓ గొప్పవ్యక్తిని కోల్పోయిందని.. వ్యక్తిగతంగా తానొక ఆత్మీయుడిని కోల్పోయానని ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతీరావు చెప్పారు. మహామనిషి, గొప్ప మనసున్న మనిషి దాసరి అని ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు అన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తానున్నానని భుజం తట్టి చేదొడుగా నిలిచేవారని చెప్పారు. సినీ పరిశ్రమ గొప్ప వ్యక్తిని కోల్పోయిందని వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dasai narayana rao  demise  no more  tollywood  ill health  kims hospital  hyper tension  respiration  passes away  

Other Articles