ISRO's Biggest Rocket Is Finally Ready To Launch

Meet the gslv mk iii as heavy as 200 elephants

Fat Boy Rocket, ISRO Biggest Rocket, India's Biggest Rocket, ISRO June 7th 2017, ISRO Big Rocket, 200 Elephants ISRO, ISRO 4 Tons Rocket, GSLV Mk-III Rocket

ISRO Ready to Launch Giant Rocket. With GSLV Mk-III June 5 launch of 'fat boy' to pave way for Manned Mission.

200 ఏనుగుల బరువును ఒక్కసారిగా...

Posted: 05/29/2017 11:48 AM IST
Meet the gslv mk iii as heavy as 200 elephants

జూన్ లో మరో సంచలనానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సిధ్దమవుతోంది. చరిత్రలో నిలిచిపోయే భారీ ప్రయోగానికి సిద్ధమైపోతుంది. అతిపెద్ద బరువు కలిగిన స్వదేశీ రాకెట్ ను అంతరిక్షంలోకి ప్రయోగించనుంది. ఎంత బరువు అంటే... సుమారు 200 ఏనుగులకు సమానం.

జియో సింక్రనస్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (జీఎస్‌ఎల్‌వీ) మార్క్‌-3గా జూన్ మొదటి వారంలో శ్రీహరికోట నుంచి ఈ రాకెట్‌ ప్రయోగం చేయనుంది. 4 టన్నుల బరువుండే భారీ కమ్యూనికేషన్‌ ఉపగ్రహాలను భూ అనువర్తిత కక్ష్య (జీటీవో) లోకి ప్రవేశ పెట్టేందుకు ఈ ప్రయోగం ఎంతో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా అంతర్జాతీయ అంతరిక్ష వాణిజ్యంలో గణనీయమైన వాటాను ఒడిసిపట్టేందుకు ఇస్రోకు అద్భుతమైన అవకాశం కల్పిస్తుంది. అందుకే భారీ రాకెట్ కు ఫ్యాట్ బోయ్ అని నామకరణం చేసిన ఇస్రో పరీక్షను విజయవంతం చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.

అయితే భారీ రాకెట్ ప్రయోగం కనీసం ఆరు సార్లు విజయవంతమైతే... ఆ తరువాత దీని ద్వారా వ్యోమగామిని భారత్ రోదసీలోకి పంపే అవకాశం కలుగుతుంది. ఇంతకు ముందు ఈ లిస్ట్ లో రష్యా, అమెరికా, చైనా లుఉండగా, ఆయా దేశాలు రాకెట్ లో వ్యోమగామిని కూడా పంపాయి. ఇప్పుడు భారత్ ఆ ఫీట్ ను సాధిస్తే ఆ జాబితాలో చేరి మరో చరిత్రను భారత్ నెలకొల్పుతుంది. కానీ, గతంలో తొలి ప్రయోగాల్లో ఇస్రో విఫలమైంది. అనంతరం వైఫల్యాలను విజయాలుగా మార్చుకుందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రయోగం మాత్రం తొలిసారే విజయవంతం చేయాలని భావిస్తోంది.

ఈ భారీ రాకెట్ ప్రయోగం సక్సెస్ అయితే... అతి పెద్ద ఉపగ్రహాలను ఇస్రో సునాయాసంగా కక్ష్యలో ప్రవేశపెట్టి మరిన్ని విజయాలు అందుకుంటుంది. ఇప్పటికే క్రయోజెనిక్ ఇంజిన్ రాకెట్ ప్రయోగాల కోసం ప్రపంచ దేశాల నుంచి ఇస్రోకు ఆర్డర్లు పెరుగుతున్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISRO  Fat Boy  Big Rocket  GSLV Mk-III  

Other Articles