Chandra Babu interrupts Gadde Baburao Speech At Mahanadu

Chandrababu gadde baburao conversation in mahanadu

Chandrababu Naidu Mahanadu, Mahanadu Speechs, Chandra Babu interrupts Gadde Baburao, TDP Leader Boring Speech, Mahanadu Boring Speechs, Chandrababu Nadiu Speech, Chandrababu Naidu Boring Mahabnadu, Boring Vizag Mahanadu

Chandrababu Naidu Dissapoint with Gadde Baburao's Speech. Later reminds babu about his MLC seat.

బాబూ! పసలేని ప్రసంగాలతో ‘మహా’బోర్

Posted: 05/29/2017 10:11 AM IST
Chandrababu gadde baburao conversation in mahanadu

సాగర తీరంలో పసుపు జెండా రెపరెపలతో టీడీపీ పండగ మహానాడు విజయవంతంగా జరిగింది. సభా వేదికపైన అధినేత చమక్కులు.. కూల్ కూల్ గా సాగిపోయింది. చంద్రబాబు, లోకేష్ ల భజనతోపాటు పనికి రాని తీర్మానాలు చేశారంటూ ప్రతిపక్ష వైఎస్సార్పీపీ ఓవైపు విరుచుకుపడుతూనే ఉండగా, మరోపక్క తాను చేసిన దెయ్యాల కొంప వ్యాఖ్యాలకు విద్యార్థులు, ఏయూ వైస్ ఛాన్స్ లర్, సమాజంలోని పెద్దలందరికీ క్షమాపణ కోరాడు ఎమ్మెల్సీ ఎంవివిఎస్‌ మూర్తి. ఈరోజు ఆఖరి రోజు కావటంతో పలు తీర్మానాలతో ముగించే మహానాడును అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే స్టేజీ మీద ప్రసగించేందుకు ఆదివారం కొంత మంది నేతలకు అవకాశం కలకగా, వారిలో చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు కూడా ఉన్నారు. కానీ, ఆయన ప్రసంగిస్తున్న వేళ కార్యకర్తలంతా నీరసంగా మారిపోవటంతో చంద్రబాబు కలగజేసుకున్నాడు. టైం తక్కువగా ఉందని, మిగతా వారికి అవకాశం ఇవ్వాలని, అది గాక వినేవారిని ఆకట్టుకునేలా ప్రసంగాలు చేయడం నేతలు నేర్చుకోవాలని, ఆ తరువాతనే వేదిక ఎక్కాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సూచించాడు. పసలేని ప్రసంగాలతో కార్యకర్తలకు బోర్ కొట్టిస్తే ఎలా? అన్న రీతిలో ప్రశ్నించాడు.

బాబూరావు మాట్లాడుతున్న అంశాలు పెద్దగా ఆకట్టుకునేలా లేవని పరోక్షంగా చేసిన కామెంట్లు ఆయక కాస్త హర్టయినట్లు ఉన్నాడు. అందుకే రెండు నిమిషాలు అంటూ తాను అన్ని పదవులను రెండేసి సార్లు చేపట్టానని, ఎమ్మెల్సీ మాత్రం ఒక్కసారేనంటూ మనసులోని కోరికను బయటపెట్టి స్టేజీ దిగిపోయాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu Nadiu  Mahanadu  Gadde Baburao  Boring Speech  

Other Articles