Shiva Kumar New Allegations in Sai Sri Death

Sai sri death new twist

Madamsetti Siva Kumar, Sai Sri Death, Sai Siva Sri Death, Sai Sri, Suma sri and Sai Sri, Suma Sri Kill Sai Sri, Sai Sri Death Case, Sai Sri Case Twist, Shiva Kumar New Allegations, Sai Sri Father Siva Kumar, Sai Sri Krishna Kumar, Suma Sri Cheat Siva Kumar

Sai Siva Sri Father Shiva Kumar New Allegations. Mother Suma Sri Killed Her. He Had no relation with both Suma sri and Sai Sri.

షాక్: సాయిశ్రీ అసలు శివ కూతురే కాదా?

Posted: 05/29/2017 12:39 PM IST
Sai sri death new twist

నాన్న నన్ను బతికించు.. అంటూ వీడియోలో తండ్రిని ఆర్తిగా వేడుకున్న సాయి శివశ్రీ ఉదంతం గుర్తుందా? ఆ కథనం వెలువడిన కొద్ది రోజులకే చిన్నారి ప్రాణాలు వదిలింది. భర్త నిర్లక్ష్యం చేయటంతోనే తన బిడ్డ చనిపోయిందంటూ తల్లి సుమశ్రీ సహా బంధువులంతా ఆరోపించారు. దహన సంస్కారాలకు తీసుకెళ్తున్న సమయంలో జరిగిన ఉద్రిక్త పరిస్థితులతో విషయం ప్రభుత్వం దృష్టికి కూడా చేరిపోయింది. ఈ కేసులో ఇప్పుడో షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు నిందితుడు మాదం శెట్టి శివకుమార్.

అసలు సుమశ్రీ తన భార్య కాదని, శివశ్రీ కూతురు కాదంటూ ఓ ప్రకటన వెలువరించాడు. వారికి తనకు అస్సలు సంబంధం లేదని చెప్పటంతోపాటు మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు కూడా. సాయి శివశ్రీ అసలు అనారోగ్యంతో చనిపోలేదని, తల్లి సుమశ్రీ కొందరితో కలిసి హత్య చేసిందని ఆరోపించాడు. ఈ విషయంపై ఇప్పటికే మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించిన శివ త్వరలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయన్నట్లు తెలిపాడు.

సుమశ్రీ అలియాస్ వెంకటేశ్వరమ్మ తన ఫ్లాట్ లో అద్దెకు దిగిందని, ఎవరూ లేకపోవటంతో చేరదీశానని, పాప వైద్యానికి అవసరమైన డబ్బు కూడా భరించానని, కేవలం మానవతా దృక్పథంతోనే ఇదంతా చేశానని చెప్పటం విశేషం. ఆపై 8 లక్షల నగదుతో సుమ ఉడాయించిదని, తర్వాత తేలింది ఏంటంటే.. కృష్ణ కుమార్ అనే వ్యక్తికి సుమశ్రీ మూడో భార్య అని చెప్పుకొచ్చాడు. తన ఫ్లాట్ లో ఇంతకు ముందు అసాంఘిక కార్యకాలపాలు జరిగాయన్న ఆయన, బొండా ఉమ అనుచరులు ఆ ఫ్లాట్ కోసం బెదిరింపులకు దిగిన విషయాన్ని కూడా గుర్తుచేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sai Sri Case  Father Siva Kumar  New Allegations  

Other Articles