Melania publicly snubs Donald Trump again కాంతదాసుడికి కునుకు కరువు చేస్తున్న సతి..

In rome melania again refuses to hold president trump s hand

Melania publicly snubs Donald Trump again, donald trump, melania trump, rome, vatican city, US president, America, Video shows, agonising moment, economics summit, official visit, iconic stairs, waiting cameras, opposite side, awkward moment, affectionate gesture, Rome, Italy, Air Force One, Francis

Melania Trump has coolly snubbed her husband for the second day in a row, literally leaving him hanging as the couple disembarked Air Force One in Rome.

ITEMVIDEOS: రోమ్ లోనూ ట్రంప్ కు తప్పని సతి పరాభావం..

Posted: 05/24/2017 04:49 PM IST
In rome melania again refuses to hold president trump s hand

ఎంతవారు గానీ.. వేదాంతులైన గానీ.. కాంతదాసులేనంటూ తెలుగు కవులు ఎప్పుడో చెప్పారు. ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు. అఖరున అమెరికా అధ్యక్షుడైనా సరే. అయితే వారితో సఖ్యతగా వుంటేనే ఇమిడి గౌరవ మర్యాదలు.. వారి మనతో విభేధించిన్నప్పుడు మాత్రం విమర్శలు వెల్లువ తప్పదు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విషయంలోనూ అదే జరిగింది. ఒకసారి జరిగితే అనుకోకుండా జరిగిందని అనుకోవచ్చు. కానీ అదే ఘటన పునరావృతమైతే మాత్రం అందులోనూ అమెరికా అధ్యక్ష హోదాలో విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు.. అలా జరిగితే ఇంకేముంది చాకీరేవుల్లా వున్న సోషల్ మీడియాకు తోడు మీడియా కూడా ఉతికి అరేస్తుంది.

తాజా ఘటనలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా మధ్య విభేదాలు ఉన్నాయన్న విషయాన్ని ప్రపంచానికి చెప్పకనే చెబుతున్నాయి. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ట్రంప్, రెడ్ కార్పెట్ పై మెలానియా చెయ్యందుకోవడానికి ప్రయత్నించగా, ఆమె తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ వీడియో వైరల్ అయి లక్షలాది కామెంట్లతో చక్కర్లు కొడుతుండగానే, అటువంటిదే మరోసారి జరిగింది. అగ్రరాజ్య అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా విదేశాల్లో పర్యటిస్తున్న ట్రంప్‌.. మెలానియాతో కలిసి రోమ్‌ చేరుకున్నారు. విమానం ల్యాండ్‌ అవగానే.. ఇద్దరూ అభివాదం చేశారు. వెన్ యు ఆర్ ఇన్ లవ్ ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అంటూ ఓక నానుడి వుంది. అలాంటి రోమ్ కు చేరుకున్న అగ్రరాజ్య దంపతుల మధ్య మాత్రం సఖ్యత లేదన్నది స్పష్టమవుతుంది. అదెలా అంటారా..?

ఆ తర్వాత ట్రంప్ మెలానియా చేయి పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే మెలానియా మాత్రం అదేమీ పట్టనట్లు ఆయన చేతిని అందుకోకుండా.. అదే చేతితో జుత్తు సవరించుకుంది. ఈ ఘటనతో ఇబ్బందిపడ్డ ట్రంప్ వెంటనే తన చేత్తో మెలానియా వెన్ను తట్టి సందర్భాన్ని కవర్ చేశారు. ఇది కూడా ఇప్పుడు మీడియాకు చిక్కి వైరల్ గా మారింది. అయితే మెలానియా ఇలా కావాలని చేశారో, లేదా యాదృచ్ఛికంగా జరిగిందో తెలియదు గానీ.. ఇప్పుడు ట్రంప్ జంట నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. దీనికి తోడు ట్రంప్‌ అధ్యక్షుడై నెలలు గడుస్తున్నా మెలానియా ఇంకా శ్వేతసౌధంలోకి మారకపోవడం కూడా వారి మధ్య విబేధాలు ఉండొచ్చనే అనుమానాలకు తావిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : donald trump  melania trump  rome  vatican city  US president  America  

Other Articles