PM modi stops convey and gives way to ambulance కాన్వాయ్ ను పక్కన నిలిపి అంబులెన్స్ కు దారిచ్చిన ప్రధాని

Pm modi stops convey and gives way to ambulance

PM modi stops convey gives way to ambulance, PM modi gives way to ambulance, narendra modi, convey, gandhinagar, ahmedabad, ambulence, central government, gujarat

Putting the SPG security protocols aside, Prime Minister Narendra Modi stopped his convoy and shifted it to the side lane on Gandhinagar – Ahmedabad road in order to allow an ambulance to go ahead on priority.

ప్రాణం విలువ తెలిసిన ప్రధాని..అంబులెన్సుకు దారిచ్చారు..!

Posted: 05/24/2017 03:24 PM IST
Pm modi stops convey and gives way to ambulance

వ్యక్తులు ఎన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించినా.. కనీస ప్రమాణాలు పాటించినప్పుడే వారికి సంఘంలో విలువ పెరుగుతుందని మరోమారు చాటిచెప్పాను ప్రధాని నరేంద్రమోడీ. భారత్ దేశంలో ప్రతీ పౌరుడు వీఐపీనేనని చాటిచెప్పుతూ ఆ ఇక గుడ్‌బై చెప్పిన ప్రధాని.. తన కారుకు కూడా ఎర్రబుగ్గను తొలగించారు. ఆయన ఆయన పిలుపుతో పాటు అందించిన స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ కార్లపై ఎర్రబుగ్గలను తొలగించింది. అయితే తాను చెప్పే అంశాలను ప్రతీదానిని అవకాశం దక్కినప్పుడల్లా అచరణలో చూపడం చేసి చూపిస్తున్నారు ప్రధాని.

అంబులెన్సులు కనబడితే పక్కకు జరిగి వాటికి దారిని ఇవ్వండీ అంటూ ప్రధాని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. పలు ప్రాంతాల్లో.. పలు కీలక సమయాల్లో మినహాయించి మిగతా అన్ని సమయాల్లో అంబులెన్సులకు దేశ ప్రజలు దారినిస్తుంటారు. అయితే పలు నగరాల్లో బిజీ రోడ్లలో నిత్యం ట్రాఫిక్ సంచరిస్తున్న సందర్భాల్లో మాత్రం అంబులెన్సులకు దారి దొరకడం కష్టమే. అప్పటికీ కొందరు పక్కకు జరిగినా.. కొందరు మాత్రం దారి వదలరు. మరీ ముఖ్యంగా కార్యాలయాలకు వెళ్లే వేళల్లో మాత్రం కష్టంగా మారుతుంది.

అయితే తాజాగా ప్రధాని వెళ్తున్న రోడ్డుపై అంబులెన్సు వెళ్తున్న క్రమంలో ప్రధాని ఏం చేశారు..? అంటే త‌న కాన్వాయ్‌ను ఆపి మ‌రీ ఓ అంబులెన్సుకు దారి ఇచ్చారు మోదీ. ఆఫ్రిక‌న్ డెవ‌లప్‌మెంట్ బ్యాంక్ 52వ వార్షిక స‌మావేశాల‌ను ప్రారంభించేందుకు గుజ‌రాత్‌లోని గాంధీన‌గ‌ర్‌కు వెళ్లిన ప్రధాని.. అక్కడి నుంచి అహ్మదాబాద్ వెళ్తుండగా, అదే సమయంలో ఆయనకు వెనుకగా ఓ అంబులెన్స్ వెళ్తుంది. దాన్ని గ‌మ‌నించిన మోదీ ప్రొటోకాల్‌ను ప‌క్కనపెట్టి తన కాన్వాయ్‌ను పక్కకు తీసుకోమ్మని చెప్పి.. అంబులెన్సుని ముందుగా వెళ్లేలా చేశారు. దీంతో ప్రాణం విలువ తెలిసిన ప్రధాని అంటూ గుజరాత్ వాసులు కితాబిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  convey  gandhinagar  ahmedabad  ambulence  central government  gujarat  

Other Articles