James Bond actor Roger Moore dies at 89 తుదిశ్వాస విడిచిన నటకిషోరుడు సర్ రోజర్ మూర్

Former james bond star sir roger moore dead at 89

roger moore actor, james bond star dead, sir roger moore dead, james bond roger moore, james bond acvtor dead, roger moore dead james bond, james bond star, roger moore age, roger moore dies, hollywood news, entertainment updates, indian express, indian express news, indian express entertainment

Hollywood actor and former James Bond star Sir Roger Moore died in Switzerland on Tuesday after “short but brave battle with cancer.

తుదిశ్వాస విడిచిన నటకిషోరుడు సర్ రోజర్ మూర్

Posted: 05/23/2017 10:54 PM IST
Former james bond star sir roger moore dead at 89

'బాండ్.. జేమ్స్ బాండ్’ అంటూ తనదైన స్టయిల్ లో పలుకుతూ, పలు సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించిన 'జేమ్స్ బాండ్' హీరో సర్ రోజర్ మూర్ (89) మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. కొద్ది కాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న తమ తండ్రి ఈ రోజు మృతి చెందారని, బరువెక్కిన హృదయాలతో ఈ బాధాకరమైన వార్తను తెలియజేస్తున్నామని ట్విట్టర్ ఖాతా ద్వారా రోజర్ మూర్ పిల్లలు తెలిపారు.

స్విట్జర్లాండ్ లో మృతి చెందిన రోజర్ మూర్ అంత్యక్రియలు మొనాకోలో నిర్వహించనున్నారు. కాగా, బాండ్ చిత్రాలలో ‘స్పై’ పాత్రలో రోజర్ మూర్ నటించారు. ‘లివ్ అండ్ లెట్ డై’, ‘స్పై హూ లవ్డ్ మీ’, ‘ఆక్టోపసీ’, ‘ఫర్ యువర్ ఐస్ ఓన్లీ’, ‘ఏ వ్యూ టూ ఏ కిల్’ సినిమాల్లో రోజర్ మూర్ ‘జేమ్స్ బాండ్’ పాత్రలు పోషించారు. ‘ది లాస్ట్ టైమ్ ఐ సా ప్యారిస్’, ‘ఇంటరప్టెడ్ మెలోడీ’, ‘ది కింగ్స్ థీఫ్’, ‘ది మిరాకిల్’ తదితర చిత్రాల్లో రోజర్ మూర్ నటించారు.

జేమ్స్‌ బాండ్‌ సిరీస్‌లో అత్యధికంగా ఏడు సినిమాల్లో నటించిన నటుడు ఈయన. ఏకంగా 12 ఏళ్ల పాటు ఒకే పాత్రలో ఒదిగిపోయారు. భారతీయ మూలాలు ఉన్న ఇంగ్లీష్‌ నటుడు రోజర్‌ మూర్‌. 1927 అక్టోబర్‌ 14వ తేదీన కలకత్తాకు చెందిన లిలియన్‌కు జన్మించాడు. సీన్‌ కెనరీ తర్వాత జెమ్స్‌ బాండ్‌ సిరీస్‌ను కొనసాగించిన నటుడు. 1973 నుంచి 1985 వరకూ జేమ్స్‌ బాండ్‌ సినిమాల్లో రోజర్‌ నటించాడు.

అప్పటి వరకూ సీన్‌ కెనరీ జేమ్స్‌ బాండ్‌ సిరీస్‌లో నటిస్తూ ఉండేవాడు. ఆయన 1969లో తాను ఇక ఈ పాత్ర చేయనని ప్రకటించడంతో కెనరీ స్థాయంలో రోజర్‌ నటించాడు. రోజర్‌ మోడల్‌గా పనిచేసేవాడు. సినిమా రంగంలోకి వచ్చాక అసలు ఇతను పనికి రాడనే ఓ వాదన చాలా మంది తీసుకొచ్చారు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టాయి. ఆ తరువాత ఆయనను ఎట్టకేలకు ఈ పాత్రకు ఎంపిక చేశారు. ఆ పాత్రలో ఏకంగా 12 ఏళ్ల పాటు ఒదిగిపోయిన రోజర్‌ చిరవకు ఈ క్యారెక్టర్‌కు 1985లో టాటా చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : roger moore  hollywood actor  james bond  hollywood  cancer  Switzerland  

Other Articles