23 pilgrims from MP killed in bus accident in Uttarakhand

23 pilgrims feared dead as bus falls into gorge in uttarkashi

Uttarakhand, Uttarakhand Bus Mishap, Uttarakshi Bus Plunges River, Uttarakshi Mishap, Bus Fall into River, Uttarakhand Bus Accident, Bus Fall river North India, Pilgrims Bus Fall River, Madhya Pradesh Pilgrims Death, Chardham Yatra Mishap Gangothri Dham Mishap

Bus carrying 29 pilgrims from MP, falls into river near Nalupani, Uttarakshi Uttarakhand, 22 bodies recovered. CM Shivraj Singh Chouhan announced exgratia of Rs two lakh each next to the kin of those killed in the mishap.

పవిత్ర యాత్రలో ఘోర ప్రమాదం

Posted: 05/24/2017 07:33 AM IST
23 pilgrims feared dead as bus falls into gorge in uttarkashi

ఉత్తరాఖండ్ లో పెను విషాదం చోటుచేసుకుంది. భాగీరథి నదిలో యాత్రికులతో కూడిన ఓ బస్సు పడిపోయిన ఘటనలో 23 మంది దుర్మరణం పాలయ్యారు. వీరంతా మధ్యప్రదేశ్ కు చెందిన వారిగా గుర్తించారు.

మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో గంగోత్రి ధామ్ నుంచి తిరుగు ప్రయాణంలో ఉత్తరాక్షి జిల్లాలోని నలుపని వద్ద అదుపు తప్పి 300 మీటర్ల లోతులో నదిలో పడింది. ఘటనా స్థలంలో 20 మంది మృతి చెందగా తీవ్రంగా గాయపడిన ఏడుగురిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరొ ముగ్గురు మరణించారు. ప్రమాద సమాచారం అందుకున్న ఎస్‌డీఆర్ఎఫ్, ఐటీబీపీ, పోలీస్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 29 మంది ప్రయాణిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

ఇక వీరిలో ఎక్కువ మంది ఇండోర్‌కు చెందినవారై ఉంటారని భావిస్తున్నారు. ఈనెల 12 చార్‌ధామ్ యాత్రకు బయలుదేరిన భక్తులు యమునోత్రి, గంగోత్రిని దర్శించారు. ప్రస్తుతం హరిద్వార్, అక్కడి నుంచి కేదారినాథ్ వెళ్లాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ప్రమాద విషయం తెలిసి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు స్పెషల్ టీం తో సహాయక చర్యలు చేపట్టాలని విజ్నప్తి చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chardham Pilgrims  Madhya Pradesh  Uttarakhand  Uttarakshi  Death  

Other Articles