woman cheats locals for rs.20 crores held మోసం చేయడంలో ఈమె ఇంద్రాణి సిస్టరే..!

Woman cheats locals for rs 20 crores held

aruna reddy, aruna reddy held for cheating, aruna reddy a local indrani, aruna reddy high rate of interest, aruna reddy backdoor jobs, aruna reddy mj colony maulali, aruna reddy nalgonda police, aruna reddy malkajgiri police, telangana news, India news, latest news

aruna reddy a local of mj colony, moulali, of medchal district had cheated locals of around Rs. 20 Crores of ruppees, by assuring them high rate of interest.

వంచకి: మాయమాటలతో రూ.20 కోట్ల మేర శఠగోపం..!

Posted: 05/16/2017 01:05 PM IST
Woman cheats locals for rs 20 crores held

సక్రమంగా అర్జిస్తే ఎంత కాలానికైనా కాస్తా కూస్తో కూడబెట్టవచ్చునేమో కానీ.. కోట్ల రూపాయాలను మాత్రం అర్జించలేమని తెలుసుకున్న ఓ మహిళ అక్రమాలకు నాంది పలికింది. అక్రమాలలో ఇంధ్రాణి ముఖర్జీ కన్నా తక్కవే అయినా..  మోసాలు చేయడంలో మాత్రం అమె కన్నా అధికమందినే ముంచానని గర్వపడింది. ఎంత ఎగసినా కెరటం కిందపడక తప్పదని తెలయదు కాబోలు అందుకనే ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతుంది. అధిక వడ్డీ ఆశ చూపి అమాయకులను మోసం చేసిన కోట్ల రూపాయల మేర మోసానికి పాల్పడిన వంచకి ఘటన మేడ్చల్ జిల్లాలో సంచలనంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. తమకు మంచి వ్యాపారం వుందని అందులో పెట్టుబడులు పెడితే ఏకంగా 30 శాతం మేర లాభాలు వస్తాయని నమ్మబలికింది, అందులో సుమారు 15 శాతం మేర లాభఆలను మీకు ఇస్తామని, మరీ కావాలంటే 20 శాతమైనా ఇచ్చేస్తామని నమ్మబలికింది. ఇలా ఒకరకి ఒక విధంగా మరోకరికి మరో విధంగా మాయమాటలను చెప్పి నమ్మించింది. అమాయకులకు వేసిన ఏకం ఫలించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూపాయలు 20 కోట్ల వరకు వసూలు చేసింది. ఇస్తామన్న సయమానికి అసలు లేక వడ్డీ రాక బాధితులు అమెపై పోలీసులకు పిర్యాదు చేశారు.

మేడ్చల్ జిల్లా మల్కాజ్ గిరి మౌలాలి ఎమ్.జె.కాలనీలో ఉండే అరుణారెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులకు మరో విషయం తెలిసింది. కేవలం అధిక వడ్డీ మాత్రమే కాదు బ్యాక్ డోర్ ద్వారా ప్రముఖ కంపెనీలలో ఉద్యాగాలు ఇప్పిస్తామని, మరికోందరికి ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాలనే ఇప్పిస్తామని నమ్మబలికి వారి నుంచి కూడా డబ్బులు వసూలు చేసింది. ఇక ఇంకోందరి తమకు తెలిసిన వాళ్లు విదేశఆల నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారని, వారి నుంచి బంగారాన్ని సగం ధరకే ఇప్పిస్తామని కూడా నమ్మబలికి అక్రమంగా డబ్బును వసూలు చేసి శఠగోపం పెట్టింది.

ఇలా అరుణారెడ్డి బాధితుల సంఖ్య పెరుగుతూ పోయింది. తమ డబ్బును తమకు చెల్లిస్తే చాలునని కూడా బాధితులు అమెకు మొరపెట్టుకున్నారు. అయినా అమె వినిపించుకోలేదు. ఇక బాధితుల ఒత్తిడి పెరుగుతుండడంలో ముఖం చాటేసింది. అమెపై నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసు నమోదు కాగా, దాదాపు రూ.20 కోట్ల వరకు టోకరా వేసిందని పోలీసులు అంచనాకు వచ్చారు. కాగా అమెను ఇటీవల ఒకకేసులో నల్గొండ పోలీసులు అరెస్టు చేశారని తెలసుకున్న మల్కాజ్ గిరి పోలీసులు పీటీ వారెంట్ జారీ చేసి అమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aruna reddy  mj colony  moulali  malkajgiri police  nalgonda jail  telangana  

Other Articles