Komati Reddy Hails Minister Harish Rao

Komati reddy lauds govt over mosambi market

Harish Rao, Komati Reddy Venkat Reddy, Harish Rao Komati Reddy, Congress Harish Rao, Harish Rao Nalgonda Tour, Congress Praise Harish Rao, Harish Rao Baahubali, TRS Harish Rao KTR KTR Versus Harish Rao Congress, Harish Rao Join TRS, Komati Reddy Hails Harish Rao

Now Congress eye on Telangana Minister Harish Rao. Senior Leaders Praise him as Great Politician. After Survey Satyanarayana Now Komati Reddy Praised Harish Rao.

హరీష్ సభకు కు కాంగ్రెస్ భారీ సాయం

Posted: 05/16/2017 12:28 PM IST
Komati reddy lauds govt over mosambi market

తెలంగాణలో కాంగ్రెస్ చాలా విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. సీనియర్ నేతలు ఉన్నప్పటికీ, పార్టీని సరైన దారిలో నడిపించే నాయకుడే కరువయ్యాడు. ఇది చాలదన్నట్లు టీఆర్ ఎస్ కంటే ఘనంగా ఏదో ఒక రోజు బాహుబలిలా ఖ్యాతిని సొంతం చేసుకుని పునర్వైభవం చాటుతామని గప్పాలు కొట్టుకుంటున్నారు. అదే సమయంలో రాజకీయ చదరంగం ఆడుతూ పావులు కదుపుతున్నారు కొందరు నేతలు.

కొంత కాలం నుంచి సీఎం కేసీఆర్ మేనల్లుడు, ఇరిగేషన్ మంత్రి హరీష్ రావును టార్గెట్ చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సీనియర్ నేత, మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ హరీష్ గొప్ప నేత అంటూ పొలిటికల్ కమిట్ మెంట్ ను పొగుడుతూ త్వరలో కాంగ్రెస్ లో చేరతాడంటూ మైండ్ గేమ్ కు ఆజ్యం పోశాడు. దాన్నే ఇప్పుడు కొమటిరెడ్డి లాంటి మరికొందరు కీలక నేతలు కూడా కొనసాగిస్తున్నారు.

నల్గొండ జిల్లాలో ఉదయ సముద్రం ప్రాజెక్టు పనుల పరిశీలన, బత్తాయి మార్కెట్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీష్ వెళ్తున్నాడు. దీనిపై హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. అంతేకాదు కొమటి రెడ్డి ఆదేశాలతో కార్యకర్తలు రంగంలోకి దిగి ఏర్పాట్లను పరిశీలించటం, భారీ జనసమీకరణ చేస్తున్నారు. మరోవైపు ఎవరూ కూడా హరీష్ రావును అడ్డుకునే యత్నం చేయొద్దంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడంట. ఈ లెక్కన హస్తం వలలో హరీష్ పడే పరిస్థితులు ఎంత మాత్రం ఉన్నాయో విశ్లేషకులు ఇప్పుడు బేరీజు వేసుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Harish Rao  Congress  

Other Articles