Transgenders in Fray to join Police Force

Hijras inspired with prithika yashini

Tamil Nadu Transgenders, Transgender SI, Hijras, Hijras SI, Hijra Police, Transgenders Applied,Transgender Motivation, Tarika, Tarika Hijra, First Hijra Inter Student, Tamil Nadu Hijra Student, Transgender Student, Prithika Yashini Story

At least 50 Transgenders have applied for the 15,000 plus vacancies of police constables, firemen and jail warders for which the Tamil Nadu. Transgender to clear Exam hopes to become Doctor.

పోలీస్ ఉద్యోగాలకు మేం పనికిరామా?

Posted: 05/13/2017 09:02 AM IST
Hijras inspired with prithika yashini

లింగ బేధాలు, తారతమ్యాలు పట్టించుకోకుండా ఇప్పుడున్న జనరేషన్ ఫాస్ట్ గా దూసుకుపోతుంది. మూడో వర్గంగా భావించే ట్రాన్స్ జెండర్ లు మిగతా వారికి సమాజంలో గర్వంగా తలెత్తుకుని తిరగ గలిగే పనులు చేస్తున్నారు. ఆ మధ్య తమిళనాడులో ప్రితికా యాషిన్ అనే ఓ హిజ్రా ఇటీవలే ఎస్ఐ ఉద్యోగానికి ఎంపికైన విష‌యం తెలిసిందే. దేశంలోనే మొట్ట మొదటి సారి ఎస్ఐ పోస్టును ద‌క్కించుకున్న‌ హిజ్రాగా పేరు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం ప్రితికా త‌మిళ‌నాడులోని ధర్మపురిలోని పోలీసు స్టేషన్‌లో పదవీ బాధ్యతలు నిర్వ‌ర్తిస్తోంది కూడా.

ప్రితికా స్ఫూర్తితో ఈ సారి ఏకంగా 50 మంది హిజ్రాలు పోలీసు ఉద్యోగాలకు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 21న ఆ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల ఎంపిక రాత పరీక్షలు జ‌ర‌గ‌నున్నాయి. సమాజంలో ఎన్నో అవ‌మానాలు ఎదుర్కునే హిజ్రాలు ప్ర‌ితికా ఇచ్చిన స్ఫూర్తితో విద్య, ఉపాధి ద్వారా అభివృద్ధి బాటలో నడుస్తున్నారు.

డాక్టర్ అవ్వాలనుంది.. తారిక

16 ఏళ్ల వయసులో తారిక(అంతకు ముందు బాలుడు) ఇంట్లో చెప్పా చేయకుండా చెన్నైకి పారిపోయి వచ్చాడు. చిన్నప్పటి నుంచి అమ్మాయిల్లా బట్టలు వేసుకోవాలని, వారితో తిరగాలని ఇలాంటి కోరికలతో తన బాధలను పైకి చెప్పుకోలేక హిజ్రా గ్రూప్ లో కలిసిపోయాడు. అక్కడ తారికగా పేరు మార్చేసింది ఉద్యమకారిణి గ్రేస్ బాను. అంబట్టూరులోని ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసింది.

ఇప్పుడు తమిళనాడులో ఫ్లస్ టూ పూర్తి చేసిన మొదటి హిజ్రాగా తారిక హిస్టరీ క్రియేట్ చేసింది. నిన్న రిలీజ్ చేసిన ఫలితాల్లో 535 మార్కులు సాధించి వార్తల్లో నిలిచింది.  భవిష్యత్తులో డాక్టర్ అయి తీరతానని, హిజ్రాల గౌరవాన్ని కాపాడేందుకు కృషి చేయాలని తన లాంటి వారికి పిలుపునిస్తోంది. హిజ్రాలంటే కేవలం బెదిరించి అడుక్కుతినేవారన్న భావన జనాల్లో ఉంది. కొందరు చేసే పనులు అలా ఉంటాయి. కానీ, మాకు గౌరవం ఉందని నిరూపించుకోవాలంటే ఇలా అన్ని రంగాల్లో రాణించాలి. అందుకు ప్రభుత్వం, ప్రజల సహకారం అవసరం అని గ్రేస్ భాను చెబుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamil Nadu  Transgenders  Prithika Yashini  

Other Articles