Sonia Gandhi, Rahul to be probed by IT పోనియా, రాహుల్ పై ఐటీ విచారణకు కోర్టు అనుమతి

Setback for rahul and sonia as hc allows income tax probe

National herald case, Sonia Gandhi, Rahul Gandhi, Delhi High Court, subramanian swamy, Income Tax department

The Delhi High Court today ruled that the company in which Congress president Sonia Gandhi and vice-president Rahul Gandhi are stakeholders, will be investigated by the Income Tax department in the National Herald Case.

సోనియా, రాహుల్ లకు కోర్టు కష్టాలు..

Posted: 05/12/2017 03:33 PM IST
Setback for rahul and sonia as hc allows income tax probe

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఎదురుదెబ్బ తగిలింది. నేషనల్ హెరాల్డ్ కేసులో నిధుల మళ్లింపుకు సంబంధించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతినిస్తూ ఇవాళ అదేశాలు జారీ చేసింది. వీరిద్దరినీ అదాయపు పన్ను శాఖ అధికారులు విచారించేందుకు రాష్ట్రోన్నత న్యాయస్థానం పచ్చజెండా ఊపింది. యంగ్ ఇండియా కంపెనీకి సంబంధించిన ఆదాయపు పన్ను పత్రాలను సమర్పించాలని న్యాయస్థానం అదేశించింది.

నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు అక్రమాలకు పాల్పడ్డారని బీజేపి రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం ఈ మేరకు  ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి, ఉపాధ్యక్షుడు నిధుల దుర్వినియోగం, నిధుల మళ్లింపులకు పాల్పడ్డారని ఆయన అరోపించారు. కాగా న్యాయస్థానం అదాయ పన్నుశాఖ అధికారులతో విచారణ జరిపేందుకు న్యాయస్థానం అదేశాలు జారీ చేయడం పట్ల సుబ్రహ్మణ్య స్వామి హర్షం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ నిధుల నుంచి రూ. 90 కోట్లను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ డైరెక్టర్లుగా వున్న యంగ్ ఇండియా కంపెనీ అనుబంధ  అసోసియేటెడ్ జర్నల్స్ కు రుణంగా ఇచ్చింది. వాటిని తిరిగి తీసుకునే హక్కును యంగ్ ఇ:డియా ఫ్రైవేట్ లిమిటెడ్ రూ.50 లక్షలకు అప్పగించింది. దీంతో పార్టీ నిదులను పక్కదారి పట్టించారని అరోపిస్తూ స్వామి న్యాయస్థానంలో కేసు దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం సోనియా, రాహుల్ ల విచారణకు అదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles