Andhra Pradesh State Secretariat Goes Empty

Amaravati secrateriate empty after chandrababu absent

Andhra Pradesh State Secretariat, Andhra Pradesh New Secretariat, Amaravati Secretariat, Secretariat Empty, Chandrababu Naidu US Secretariat Empty, AP Secretariat Empty, AP Secretariat Criticism, AP Secretariat Controversy, AP Secretariat Holidays, AP Secretariat No Staff, AP Secretariat Chabdrababu, Chandrababu Fire AP Secretariat Staff, Telangana Cadre Employees Relieve

AP Secretariat Goes Empty after CM Chandrababu Naidu leaves to US. none of the Ministers turning up there. Much to the disappointment of the public, who came from far away places, most of the officials, too, not arrived at the IGC.

సీఎం లేడని ఎంజాయ్ చేస్తున్నారుగా...

Posted: 05/12/2017 10:26 AM IST
Amaravati secrateriate empty after chandrababu absent

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమెరికా పర్యటనకు వెళ్లారో లేదో, అమరావతి సచివాలయం బోసిపోయింది. లోకేష్ తో సహా ఎవరూ ఇటువైపు కూడా చూడటంలేదు. అమాత్యులే రాకుంటే మనమెందుకనుకున్నారో ఏమో? ముఖ్య కార్యదర్శుల నుంచి కింది స్థాయి అధికారుల వరకూ అత్యధికులు సెక్రటేరియట్ కు రాకపోవడంతో ఆఫీసు గదులన్నీ బోసిపోయినట్టు కనిపించాయి.

సీఎం చంద్రబాబునాయుడు అటు బయలుదేరగానే కనీసం ఎయిర్ పోర్ట్ కి కూడా వెళ్లని అధికారులు కాసేపటికే ఒక్కొక్కరూ సచివాలయాన్ని వీడగా, ఇప్పుడు పూర్తిగా కళతప్పింది. కనీసం గుంటూరు, కృష్ణాజిల్లాల్లో ఉన్న మంత్రులు కూడా సచివాలయం వైపు తొంగి చూడలేదు. వాస్తవానికి శని, ఆదివారాలను సచివాలయంలో సెలవుగా పరిగణిస్తుండగా, శుక్రవారం మధ్యాహ్నం నుంచి అధికారులు తమ స్వస్థలాలకు పయనమవుతుంటారు. దీన్ని గమనించే ప్రజా విజ్ఞప్తుల రోజును గురువారానికి మార్చినప్పటికీ, ఒక రోజు ముందు నుంచే అంటే బుధవారం నుంచే ఆ సీన్ దర్శనమివ్వటం విశేషం.

మరోవైపు నారాయణ తనయుడు నిషిత్ మరణం అనంతరం మంత్రులు, అధికారులు అంతా హైదరాబాద్ కు క్యూ కట్టడం, ఆపై సీన్ నెల్లూరుకు షిఫ్ట్ కావటంతో సచివాలయాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో పాలనపరంగా ఇబ్బందులు తలెత్తటమే కాదు, స‌చివాల‌యంలో మంత్రులు ఉంటార‌ని, అధికారులు ఉంటార‌ని తమ గొడును వెళ్లబోసుకుందామని వచ్చిన ప్రజలకు ఖాళీ కుర్చీలు, వెల‌వెల బోయే స‌చివాల‌యం క‌న్పిస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు అది శృతి మించి పోవటం ఖాయమని విశ్లేషకులు చెబుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఎలాంటి రియాక్షన్ ఇస్తాడో చూడాలి.

తెలంగాణ ఉద్యోగుల రిలీవ్...


ఏపీ అసెంబ్లీ నుంచి గురువారం తెలంగాణ స్థానికత కలిగిన 53 మంది ఉద్యోగులు రిలీవ్ అయ్యారు. అనంతరం వారు వెలగపూడి నుంచి హైదరాబాద్‌కు బస్సులో బయలుదేరారు. సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు సహకరించిన ఏపీ శాసనసభాధిపతి కోడెల శివప్రసాదరావుకు ఈ సందర్భంగా ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ శాసనసభ నుంచి రిలీవ్ అయిన వారిలో పదిమంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, ఒక అసిస్టెంట్ సెక్రటరీ కాగా, మిగిలిన వారు నాలుగో తరగతి ఉద్యోగులు. ఏపీ శాసనసభ నుంచి మరో 37 మంది ఇంకా రిలీవ్ కావాల్సి ఉందని వారు తెలిపారు. ఇక తెలంగాణకు పయనమైన ఉద్యోగులకు ఏపీ అసెంబ్లీ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. అమరావతికి చిహ్నమైన బుద్ధుడి బొమ్మను కానుకగా అందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP Secretariat  Ministers Officials  Chambers Empty  

Other Articles