SBI Denies Reports on ATM Withdrawals Charges

All sbi atm withdrawals not chargeable

State Bank of India, State Bank of India ATM Surcharge, Withdrawals Charges, SBI ATM Withdrawal, SBI Fake News, SBI Rumours, State Bank of India Mobile Wallet, Mobile Wallet Charges, SBI Mobile Wallet, SBI ATM Charges, SBI Fake News, Media Reports SBI, SBI New Facility

State Bank of India (SBI) says new facility that would enable cash withdrawal through ATMs. Using the bank’s Mobile Wallet will carry a charge of Rs 25 on every transaction.

ఎస్బీఐ ప్రకటన ఓ ఫేక్ న్యూస్

Posted: 05/12/2017 10:03 AM IST
All sbi atm withdrawals not chargeable

అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) మరో కీలక నిర్ణయం తీసుకుందా?. ఏటీఎంల నుంచి నగదు విత్ డ్రా చేస్తే 25 రూపాయిలు ఛార్జ్ వసూలు చేయాలని చూస్తుందా?. ఇదివరకు ఉన్న నాలుగు ఉచిత విత్ డ్రాలను ఎత్తేయబోతుందా? జూన్ 1 2017 నుంచి కొత్త నిబంధనలు అమలు చేస్తున్నట్లు ఓ ప్రకటన మీడియాలో హల్ చల్ చేస్తోంది.

రూ పే క్లాసిక్ కార్డు దారులకు మాత్రమే ఫ్రీ సదుపాయాలను కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. పరిధి దాటితే 10,000 అంతకన్నా ఎక్కువ బ్రాంచ్ ల వద్ద లావాదేవీ జరిపితే 50 రూపాయలు ఫస్ల్ సర్వీస్ టాక్స్, ఇతర ఏటీఎంలలో విత్ డ్రాయల్ కు 20 రూపాయలు ఫ్లస్ టాక్స్, ఎస్బీఐ ఏటీంలలో గనుక జరిపితే 10 రూపాయలు ఫ్లస్ టాక్స్.. ఇలా కొత్త నిబంధనలతో ప్రకటన వెలువడిందని, డిపాజిట్ లు, ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ ల విషయంలో కూడా ఈ నిబంధనలను సవరించినట్లు అందులో ఉంది.

దీనిపై ఎస్బీఐ మేనేజింగ్ డైరక్టర్ రజనీష్ కుమార్ స్పందించాడు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశాడు. ఇంతకు ముందు ఉన్న నిబంధనలు యథాతథంగా ఉంటాయని, కేవలం ఈ బడ్డీ, మొబైల్ వాలెట్ ద్వారా ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా చేసుకునే సదుపాయం, దాని ఛార్జీల గురించి మాత్రమే నోటికేషన్ వచ్చిందని ఆయన తెలిపాడు. అయితే అందులోనూ చిన్న తప్పులు ఉండటంతో తిరిగి మళ్లీ ఉత్తర్వులు జారీ చేస్తామని వెల్లడించాడు. నోట్ల రద్దు తర్వాత ప్రజల కోసం నగదు లావాదేవీలలో సడలింపు చేసిన బ్యాంకులు తర్వాత ఒక్కోక్కటిగా నిబంధనలను కఠిన తరం చేస్తూ వస్తున్నాయి. ఆన్ లైన్ బ్యాంకింగ్ ప్రోత్సాహకం పేరిట ఇలా భారీ ఎత్తున్న ఛార్జీలు వసూలు చేస్తూ వస్తుండగా, అందులో ప్రభుత్వ రంగం బ్యాంకు అయిన ఎస్బీఐ యే ముందంజలో ఉండటం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : State Bank of India  ATM Withdrawal Charges  Fake News  

Other Articles